ఆ విషయంలో మోదీ విఫలం!


ఆ విషయంలో మోదీ విఫలం!
Priyanka Gandhi

ఆ విషయంలో మోదీ విఫలం!

భటిండా (పంజాబ్‌): బీజేపీ  అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో దేశంలో  12,000 మంది రైతులు ఆత్యహత్యలకు పాల్పడ్డారని, రైతుల  కష్టాలను  మోదీ పట్టించుకోలేదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు.

మంగళవారం పంజాబ్‌లోని భటిండాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ మేఘాల వల్ల భారత యుద్ధవిమానాలు పాకిస్థాన్‌ రాడార్‌ నుంచి తప్పించుకోగలిగాయని ప్రధాని మోదీ చెప్పడం సిగ్గుచేటని, ఇప్పుడు ఆయన గురించి అసలు నిజాలు ప్రజల రాడార్‌కు తెలిసిపోయాయని ఎద్దేవా చేశారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానన్న మోదీ ఆ ఊసే ఎక్కడా ఎత్తడం లేదని విమర్శించారు.

ఈ ఐదేళ్లూ చేసిందేమీ లేకపోవడంతో భారత వాయుసేన జరిపిన దాడుల గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవాచేశారు. బాలాకోట్‌లో దాడులు జరిగిన రోజు మేఘాలు దట్టంగా కమ్ముకోవడం వల్ల మన యుద్ధవిమానాలు పాక్‌ రాడార్‌కు దొరకలేదని మోదీ ఒక ఆంగ్ల ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.

ఆ విషయంలో మోదీ విఫలం! | actioncutok.com

Trending now:

One thought on “ఆ విషయంలో మోదీ విఫలం!

Comments are closed.