అది విదేశీ పత్రిక! కథకుడు పాకిస్తానీ!!


Narendra Modi

అది విదేశీ పత్రిక! కథకుడు పాకిస్తానీ!!

“విదేశీ పత్రికయిన టైమ్ మ్యాగజైన్‌లో కథనం రాసిన వ్యక్తి పాకిస్తానీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకున్నారు. ఇది చాలు ఆయన విశ్వసనీయత ఏమిటో  చెప్పడానికి” అంటూ ప్రధాని మోదీ అన్నారు. కొద్ది రోజుల కిందట టైమ్ మ్యాగజైన్‌ లో ‘భారత విభజనాధికారి’ అనే శీర్షికన ప్రధాని నరేంద్ర మోదీపై ఓ కథనం ప్రచురితమైన  సంగతి తెలిసిందే.

దానిపై ఇది ప్రధాని మోదీ స్పందన. మ్యాగజైన్‌ కవర్‌ స్టోరీగా ప్రచురితమైన ఆ కథనాన్ని  ఆతిష్ తసీర్‌ అనే పాకిస్తానీ రాశారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం గతంలో కంటే ఎక్కువ విభజనకు గురవుతోంది’ అని అందులో వ్యాఖ్యానించారు. మూక దాడులు, యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించడం, మాలేగావ్ పేలుడు నిందితురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు లోక్‌సభ టికెట్ ఇవ్వడం వంటి పలు అంశాలను  ప్రస్తావించారు.

అంతేగాక ఆ మ్యాగజైన్‌ కాంగ్రెస్ పైనా విమర్శలు ఎక్కుపెట్టింది. వంశపారంపర్య రాజకీయాలు తప్ప ఆ పార్టీ చేసేదేమి లేదని విమర్శించింది. మరో కథనంలో  ఆర్థిక సంస్కరణలకు మోదీ ఒక ఆశాదీపం అంటూ ప్రశంసించింది. విభజనాధికారి అంటూ మోదీపై చేసిన విమర్శల మీద బీజేపీ  తీవ్రంగా మండిపడింది.

అది విదేశీ పత్రిక! కథకుడు పాకిస్తానీ!! | actioncutok.com

More for you: