నయన్ వర్సెస్ తాప్సీ

నయన్ వర్సెస్ తాప్సీ
దక్షిణాదిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న కథానాయికల్లో నయనతార ఒకరు. ఇటీవలే ఐరా చిత్రంతో పలకరించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. త్వరలో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో పలకరించబోతోంది. ఆ చిత్రమే ‘కొలైయుదిర్ కాలమ్’. ‘ఈనాడు’ ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ మూవీ.. తమిళనాట జూన్ 14న విడుదల కాబోతోంది.
తెలుగులోనూ అదే రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కట్ చేస్తే.. అదే రోజున మరో టాలెంటెడ్ హీరోయిన్ తాప్సీ నటించిన ‘గేమ్ ఓవర్’ చిత్రం కూడా రిలీజ్ కాబోతోంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్.. తమిళ, తెలుగు భాషల్లో ఒకే రోజున విడుదల కానుంది. దీనికి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించాడు.
ఆరేళ్ళ క్రితం కో-స్టార్స్‌గా నయన్, తాప్సీ నటించిన ‘ఆరంభం’ కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో.. పోటీపడుతున్న సందర్భంలోనూ ఈ ఇద్దరు భామలు విజయం అందుకుంటారేమో చూడాలి.
నయన్ వర్సెస్ తాప్సీ | actioncutok.com