‘ఓ బేబి’ వచ్చేది ఎప్పుడంటే..

‘ఓ బేబి’ వచ్చేది ఎప్పుడంటే..
పెళ్ళయినా సమంత దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. సరి కదా.. వరుస విజయాలతో తన స్థాయిని మరింత పెంచుకుంది. గత ఏడాది వేసవికి ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘అభిమన్యుడు’తో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సామ్.. సెప్టెంబర్‌లో రిలీజైన ‘యూ టర్న్’తో నటిగా మరింత ఎదిగింది. ఇక ఈ సంవత్సరం వేసవికి వచ్చిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’, తెలుగు చిత్రం ‘మజిలీ’ కూడా సమంతకి పేరుతో పాటు పాటు విజయాలను కూడా అందించాయి.
ఈ నేపథ్యంలో.. మరో ఆసక్తికరమైన చిత్రంతో రాబోతోంది ఈ అక్కినేని వారి కోడలు. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ వెర్షన్‌గా రూపొందిన ఆ సినిమానే.. ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ఇంట్రెస్టింగ్ అండ్ హిలేరియస్ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని జూన్ మూడో వారంలో రిలీజ్ చేయబోతున్నారట.
సామ్‌కి జోడీగా నాగశౌర్య నటించిన ఈ చిత్రంలో సీనియర్ యాక్ట్రస్ లక్ష్మీ ఓ కీలక పాత్ర పోషించింది. మరి.. ‘ఓ బేబి’తోనూ సామ్ విజయపరంపర కొనసాగుతుందేమో చూడాలి.
‘ఓ బేబి’ వచ్చేది ఎప్పుడంటే.. | actioncutok.com
More for you: