నెల రోజులు.. 9 హీరోయిన్ సినిమాలు!

నెల రోజులు.. 9 హీరోయిన్ సినిమాలు!
ఇటు దక్షిణాదిలోనూ, అటు ఉత్తరాదిలోనూ ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ హవా నడుస్తోంది. అగ్ర కథానాయికలతో పాటు మీడియం, బడ్డింగ్ హీరోయిన్స్ కూడా ఈ తరహా చిత్రాల్లో నటిస్తూ.. విజయాలు అందుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. టాలీవుడ్లో నెల రోజుల గ్యాప్‌లో 9 హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ రిలీజ్‌కి రెడీ అవుతుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే.. వీటిలో స్ట్రయిట్ ఫిల్మ్స్‌తో పాటు డబ్బింగ్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి.

ఆ వివరాల్లోకి వెళితే.. మే 24న కాజల్ అగర్వాల్ నటించిన ‘సీత, అంజలి ప్రధాన పాత్రలో రూపొందిన త్రీడీ హారర్ ఫిల్మ్ ‘లిసా’, కేథరిన్ ట్రెసా-వరలక్ష్మి శరత్ కుమార్ – రాయ్ లక్ష్మి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ‘నాగకన్య’.. ఇలా మూడు చిత్రాలు రిలీజ్ కానున్నాయి.

ఇక మే 31న తమన్నా టైటిల్ రోల్ పోషించిన ‘అభినేత్రి 2’, సాక్షి చౌదరి-పూర్ణ-జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన ‘సువర్ణ సుందరి’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. జూన్ 14న నయనతార నటించిన తమిళ హారర్ మూవీ ‘కొలైయుదిర్ కాలమ్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో పాటు తాప్సీ ‘గేమ్ ఓవర్’ కూడా విడుదల కానుంది.

అలాగే.. జూన్ 21న సమంత నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ‘ఓ బేబి’ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అదే జూన్ 21న హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు ఐశ్వర్యా రాజేశ్ టైటిల్ రోల్లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా ‘కౌసల్యా కృష్ణమూర్తి’ రాబోతోంది.

ఇలా.. నాలుగు స్ట్రయిట్ పిక్చర్స్, ఐదు డబ్బింగ్ సినిమాలు.. వెరసి మొత్తంగా 9 ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ నెల రోజుల గ్యాప్‌లో తెరపైకి రానున్నాయి. మరి.. వీటిలో ఏయే చిత్రాలకి ఆదరణ దక్కుతుందో చూద్దాం.



నెల రోజులు.. 9 హీరోయిన్ సినిమాలు! | actioncutok.com