మా పార్టీ 15 నెలల పసిబిడ్డ!


మా పార్టీ 15 నెలల పసిబిడ్డ!

మా పార్టీ 15 నెలల పసిబిడ్డ!

చెన్నై: తమ పార్టీకి ఓటు వేసిన వారికి  కృతజ్ఞతలు చెప్పడంతో పాటు లోక్ సభ  ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి  విశ్వ నటుడు, మక్కల్ నీది మయ్యుమ్ పార్టీ వ్యవస్థాపకుడు  కమల్‌హాసన్ శుక్రవారం అభినందనలు తెలిపారు. ఆయన చెన్నైలోని తమ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ 15 నెలల పసిబిడ్డ  అని, పార్టీ సిదాంతాలను  ప్రజలు అర్థం చేసుకుని ఆదరించడానికి ఇది చాలా తక్కువ సమయమని అన్నారు.

తమిళనాడులో 22 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలతో పాటు, 39 పార్లమెంటరీ నియోజవర్గాల్లో కమల్ పార్టీ పోటీ చేసింది కానీ  ఒక్క చోట కూడా విజయం సాధించలేక పోయింది. బీజేపీ నాయకత్వంలోని  ఎన్డీయే సాధించిన భారీ విజయంపై అడిగిన ఓ ప్రశ్నకు కమల్ స్పందిస్తూ, అది ప్రజాతీర్పు అని అన్నారు. అదే ప్రజలు తమిళనాడులోని 39 స్థానాల్లో కేవలం ఒక్క సీటులోనే బీజేపీని గెలిపించారని గుర్తుచేశారు.

గెలిచిన రాష్ట్రాలతో పాటు తమిళనాడు సంక్షేమానికి కూడా పాటుపడాల్సిన బాధ్యత ఎన్డీయే సర్కార్‌కు ఉందని కమల్ స్పష్టం చేశారు.

మా పార్టీ 15 నెలల పసిబిడ్డ! | actioncutok.com

More for you: