ఏపీ సీయంకు హైదరాబాదీ విరాళం


ఏపీ సీయంకు హైదరాబాదీ విరాళం
Chandrababu

ఏపీ సీయంకు హైదరాబాదీ విరాళం

అమరావతి: హైదరాబాద్ కు చెందిన ఈదర వెంకట శ్రీనివాసరావు అనే యువకుడు మంగళవారం  ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబుకు  లక్ష రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు. మంగళవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో శ్రీనివాసరావు ఈ చెక్కును చంద్రబాబుకు అందజేశారు.

ఈ మొత్తాన్ని ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పథకం అమలుకు వినియోగించాలని శ్రీనివాసరావు కోరారు.  ఈ సందర్భంగా  సీఎం చంద్ర బాబు ఆతనిని మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువాళ్లు విరాళాలు అందించారు.

పలువురు వ్యక్తులు అమరావతి ఇటుకలను రూ.10 చొప్పున కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే.

ఏపీ సీయంకు హైదరాబాదీ విరాళం | actioncutok.com

Trending now: