ప్రభాస్ 20 కోసం రూ. 30 కోట్ల సెట్లు!

ప్రభాస్ 20 కోసం రూ. 30 కోట్ల సెట్లు!
మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న కథానాయకుడు ప్రభాస్. ‘బాహుబలి’ సిరీస్‌తో నేషనల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆ రెండు సినిమాలూ కూడా త్రిభాషా చిత్రాలే కావడం విశేషం.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రీకరణ తుది దశకు చేరుకోగా.. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ‘జాన్’ (ప్రచారంలో ఉన్న పేరు) (ప్రభాస్ 20) దశల వారిగా షూటింగ్ జరుపుకోనుంది. ‘జిల్’ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జాన్’.. 1970ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఇటలీ నేపథ్యంలో సాగనుంది.
అయితే.. కొన్ని దృశ్యాలను ఇటలీలోని ఒరిజనల్ లొకేషన్లలో చిత్రీకరించి.. మరికొన్నింటిని హైదరాబాద్‌లో ‘వింటేజ్ ఇటలీ’ని రీ-క్రియేట్ చేసిన సెట్స్‌లో షూట్ చేయనున్నారు. అంతేకాదు.. మొత్తంగా ఈ సినిమా కోసం 18 సెట్స్ వేస్తున్నారని.. అలాగే వాటి కోసం రూ.30 కోట్ల మొత్తాన్ని వెచ్చిస్తున్నారని టాక్. మరి.. ఇంత పెద్ద మొత్తంతో ప్రభాస్ 20 కోసంవేస్తున్న ఈ సెట్స్ సహజత్వాన్ని ప్రతిబింబిస్తాయో లేదంటే సెట్స్గానే పరిమితమవుతాయో చూడాలి మరి.
ప్రభాస్ 20 కోసం రూ. 30 కోట్ల సెట్లు! | actioncutok.com
More for you: