ఇక ఈ మెగా కాంపౌండ్ హీరోకు ‘ప్ర‌తి రోజూ పండ‌గే’నా!


పరాజయాల పరంపరకు అడ్డుకట్ట వేసిన ‘చిత్రలహరి’ తర్వాత మారుతి డైరెక్షన్‌లో ‘ప్రతి రోజూ పండగే’ అనేందుకు సిద్ధమవుతున్నాడు సాయితేజ్.

ఇక ఈ మెగా కాంపౌండ్ హీరోకు 'ప్ర‌తి రోజూ పండ‌గే'నా!
Sai Tej

ఇక ఈ మెగా కాంపౌండ్ హీరోకు ‘ప్ర‌తి రోజూ పండ‌గే’నా!

ఆ మ‌ధ్యంతా వ‌రుస‌ ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మైన మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్‌.. ఎట్టకేల‌కు ‘చిత్ర‌ల‌హ‌రి’తో కుదుట‌ప‌డ్డాడు. బాక్సాఫీస్‌ని షేక్ చేసే స‌క్సెస్ కాక‌పోయినా.. సాయితేజ్‌కి ఆర్టిస్ట్‌గా మంచి శాటిస్‌ఫ్యాక్ష‌న్‌ని ఇచ్చింది ఈ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ నేప‌థ్యంలో.. త‌న త‌దుప‌రి చిత్రం విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు తేజ్‌.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ మెగా క్యాంప్ హీరో నెక్ట్స్ ప్రాజెక్ట్ యూత్‌ఫుల్ సినిమాల స్పెష‌లిస్ట్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది.  ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. వ‌చ్చే వారంలో లాంఛ‌నంగా ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. అంతేకాదు.. కుటుంబ బంధాల నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం  తాత‌-తండ్రి-మ‌న‌వ‌డు చుట్టూ తిరుగుతుందని.. ‘ప్ర‌తి రోజూ పండ‌గే’ అనే టైటిల్‌ని అనుకుంటున్నార‌ని తెలుస్తోంది.

డ‌బ్బుకి త‌ప్ప ప్రేమాభిమానాల‌కు చోటివ్వ‌ని ఓ తండ్రిని ఓ త‌న‌యుడు త‌న తాత స‌హాయంతో ఎలా మార్చాడ‌న్న‌దే ఈ చిత్ర క‌థ‌ని స‌మాచారం. మ‌రి.. టైటిల్‌లో ఉన్న పాజిటివిటీ రిజ‌ల్ట్‌లోనూ రిఫ్లెక్ట‌య్యి.. సాయితేజ్‌కి సాలిడ్ హిట్ ద‌క్కుతుందేమో చూడాలి.

ఇక ఈ మెగా కాంపౌండ్ హీరోకు ‘ప్ర‌తి రోజూ పండ‌గే’నా! | actioncutok.com

Trending now: