పెళ్లి తర్వాతే మొదలైంది!


పెళ్లి తర్వాతే మొదలైంది!
Samantha

పెళ్లి తర్వాతే మొదలైంది!

పెళ్లి తర్వాత సమంత కెరీర్ మరింత ఊపందుకుంది. మొదట రాంచరణ్‌తో నటించిన ‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. రామలక్ష్మి పాత్రలో సమంత నటన అందర్నీ ఆకట్టుకుంది. ‘మహానటి’లో సావిత్రి కథను చెప్పే జర్నలిస్టు మధురవాణిగా ఆకట్టుకుంది. ‘యు టర్న్’లో రచన కేరెక్టర్‌ను చాలా బాగా చేసిందనే పేరు తెచ్చుకుంది.

ఇక నాగచైతన్యకు మూడు ఫ్లాపుల తర్వాత దక్కిన విజయం ‘మజిలీ’లో సమంత పాత్ర ప్రాధ్యాన్యం ఏమిటో తెలిసిందే. ఆమె చేసిన మధ్యతరగతి గృహిణి శ్రావణి పాత్రలో స్త్రీ ప్రేక్షకులు తమను తాము చూసుకున్నారు. ఆ సినిమాకు ఘన విజయం సాధించి పెట్టారు.

ఆ సినిమా సమయంలోనే తమిళంలో వచ్చిన ‘సూపర్ డీలక్స్’ సినిమాలో సమంత నటనకు విమర్శకులు మూకుమ్మడిగా బ్రహ్మరథం పట్టారు. ఆమెకు అవార్డులు రావడం గ్యారంటీ అంటున్నారు.

టాలీవుడ్‌లో ఒక నటి పెళ్లికి ముందు ఎంత డిమాండ్ కలిగి ఉందో, పెళ్లి తర్వాతా అంతే డిమాండ్ పొందడం మొదటిసారి చూస్తున్నాం. త్వరలో ఆమె ‘ఓ బేబీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నందినీరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తాను చేసిన పాత్ర ఇప్పటివరకూ చేసినవాటిలో ‘ద బెస్ట్’ అని చెప్తోంది సమంత.

మరోవైపు శర్వానంద్ మాజీ ప్రేయసిగా ’96’ తెలుగు రీమేక్‌లో నటించేందుకు సిద్ధమవుతోంది. తమిళంలో త్రిష చేసిన కేరెక్టర్‌ను ఆమె చేస్తోంది. హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో హీరోయిన్ పాత్రకూ అంతే ప్రాధ్యాన్యం ఉన్న ఆ సినిమాతో సమంత ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయం.

ఇప్పుడామె చేస్తున్నవన్నీ కథలో ప్రాముఖ్యం ఉన్న పాత్రలే. పెళ్లికి ముందటి కంటే ఇప్పుడే నటిగా ఆమె కీర్తి మరింత పెరుగుతూ వస్తోంది. రానున్న రోజుల్లో ఆమె నుంచి మరిన్ని మంచి పాత్రలు రావడం ఖాయం. ఏదేమైనా పెళ్లి తర్వాతే సమంత అసలు కెరీర్ మొదలైందనిపించక మానదు.

  • కార్తికేయ బుద్ధి

పెళ్లి తర్వాతే మొదలైంది! |actioncutok.com

Trending now:

One thought on “పెళ్లి తర్వాతే మొదలైంది!

Comments are closed.