‘ఉప్పెన’దీ అదే కథా?


'ఉప్పెన'దీ అదే కథా?

‘ఉప్పెన’దీ అదే కథా?

‘రంగ‌స్థ‌లం’.. రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో వెరీ వెరీ స్పెష‌ల్ . ఇంకా చెప్పాలంటే.. కెరీర్ బెస్ట్ మూవీ. అలాంటి ఈ సినిమాలో అంత‌ర్లీనంగా న‌డిచే అంశం.. అలాగే చిత్రాన్ని కీల‌క మ‌లుపు తిప్పే అంశం.. ప‌రువు హ‌త్య‌లు. చ‌ర‌ణ్ అన్న పాత్ర పోషించిన ఆది పినిశెట్టి పాత్ర ప‌రువు హ‌త్య‌లో భాగంగా బ‌లి కావ‌డమే.. ఈ చిత్రంలో అస‌లు సిస‌లైన ట్విస్ట్‌. ఇప్పుడ‌దే అంశంతో.. మెగా క్యాంప్‌కి చెందిన మ‌రో హీరో సినిమా తెర‌కెక్కుతోంది. అయితే అత‌నికి డెబ్యూ మూవీ కావ‌డం విశేషం.

ఆ వివరాల్లోకి వెళితే.. చిరంజీవి మేన‌ల్లుడు, సాయి తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘ఉప్పెన‌’. బుచ్చిబాబుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ.. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో.. వైష్ణ‌వ్ తేజ్ జాల‌రి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.

అంతేకాదు.. ఈ చిత్రం ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యంలో సాగుతుంద‌ని తెలుస్తోంది. పేద‌వాడైన క‌థానాయ‌కుడిని గొప్పింటి అమ్మాయి అయిన క‌థానాయిక ప్రేమిస్తుంద‌ని.. ఇది న‌చ్చ‌ని హీరోయిన్ తండ్రి హీరోని చంపించే ప్ర‌య‌త్నం చేస్తాడ‌ని టాక్‌. 

వాస్త‌వానికి.. ఆరేళ్ళ క్రితం అల్లు అర్జున్ త‌మ్ముడు అల్లు శిరీష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన  తొలి చిత్రం ‘గౌర‌వం’  కూడా ఇదే నేప‌థ్యంతో తెర‌కెక్కింది.  తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన ఆ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేక‌పోయింది. అయితే.. ‘రంగ‌స్థ‌లం’, ‘గౌర‌వం’లో క‌థానాయ‌కుల పాత్ర‌లు ప‌రువు హ‌త్య‌ల‌కు బ‌ల‌య్యే పాత్ర‌లు కావు కానీ ‘ఉప్పెన‌’లో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంద‌న్న‌మాట‌.

మొత్తానికి.. చ‌ర‌ణ్, శిరీష్ త‌ర‌హాలోనే ప‌రువు హ‌త్యతో ముడిప‌డిన చిత్రంతో వ‌స్తున్న వైష్ణ‌వ్‌కి ఎలాంటి ఫ‌లితం ద‌క్కుతుందో చూడాలి.

‘ఉప్పెన’దీ అదే కథా? | actioncutok.com

Trending now: