అద్వానీలా మౌనంగా ఉండలేను!


అద్వానీలా మౌనంగా ఉండలేను!

అద్వానీలా మౌనంగా ఉండలేను!

పాట్నా: బెంగాల్‌ ముఖ్య మంత్రి  మమతా బెనర్జీ అన్నట్లు  మోదీకి రాజకీయాల్లో కాలం చెల్లిందని  కాంగ్రెస్‌ నేత, పట్నా సాహిబ్‌ లోక్‌సభ నియోజకవర్గ  అభ్యర్థి శతృఘ్న సిన్హా వ్యాఖ్యానించారు. పార్టీ మారడానికి ముందు బీజేపీ కురువృద్ధుడు అద్వానీని కలసి బీజేపీ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పినపుడు కంట తడి పెట్టుకున్న ఆయన వద్దని మాత్రం అనలేదని, “ఒకే .. ఐ లవ్యూ” .. అని ఆశీర్వదించారని శతృఘ్న ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాకు చెప్పారు.

బీజేపీలో ఉండి ఆ పార్టీ విధానాలను శతృఘ్న విమర్శించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా శతృఘ్న ప్రాతినిధ్యం వహిస్తున్న పట్నా సాహిబ్‌ స్థానాన్ని పార్టీ ఆయనకు కేటాయించలేదు. దీంతో ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకొన్నారు. తిరిగి అదే స్థానం నుంచి బరిలోకి దిగారు. 

బీజేపీ  ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను
రంగంలోకి దింపింది. ప్రస్తుతం పార్టీలో సీనియర్‌ నాయకులకు  తగిన గౌరవం లభించడం లేదన్నారు. అయితే తాను మాత్రం అద్వానీలా  మౌనంగా ఉండలేనన్నారు. అందుకే పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపారు.

అద్వానీలా మౌనంగా ఉండలేను! | actioncutok.com

More for you:

One thought on “అద్వానీలా మౌనంగా ఉండలేను!

Comments are closed.