అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు!


అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు!
Anil Ravipudi

అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు!

వినోదాత్మ‌క చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తున్న యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. నాలుగేళ్ళ కెరీర్‌లో నాలుగు చిత్రాల‌కే ప‌రిమిత‌మైనా.. వ‌రుస విజ‌యాల‌తో ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించాడు అనిల్‌. తొలి చిత్రం ‘ప‌టాస్‌’ మొద‌లుకుని.. ‘సుప్రీమ్‌’, ‘రాజా ది గ్రేట్‌’, ‘ఎఫ్ 2’ వ‌ర‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌నే న‌మ్ముకుని విజ‌యాలు అందుకున్నాడీ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌.

ఇదిలా ఉంటే.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని మ‌హేశ్ బాబుతో చేయ‌బోతున్న అనిల్‌.. ఆ సినిమాని కూడా త‌న శైలిలోనే హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌. అంతేకాదు.. ఈ చిత్రం కోసం భారీ రెమ్యూన‌రేష‌న్‌ని కూడా అందుకోబోతోంద‌ని టాక్‌. ఇంత‌కీ.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి అనిల్ అందుకోబోతున్న పారితోషికం ఎంతో తెలుసా.. అక్ష‌రాలా రూ.10 కోట్లు అట‌!

అనిల్‌ గ‌త  మూడు చిత్రాల‌కు అందుకున్న రెమ్యూన‌రేష‌న్‌ని క‌లిపినా.. ఇంత మొత్తం లేద‌ని వినిపిస్తోంది. మొత్తానికి.. ‘ఎఫ్ 2’ సెన్సేష‌న‌ల్ హిట్ కావ‌డంతో.. మ‌హేశ్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అవ‌కాశం పొంద‌డ‌మే కాకుండా కెరీర్ బెస్ట్ రెమ్యూన‌రేష‌న్ కూడా పుచ్చుకుంటున్నాడన్న‌మాట‌ అనిల్.

ఇక ఇదే చిత్రానికి మ‌హేశ్ అక్ష‌రాలా రూ. 50 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడ‌ని టాక్‌.  మ‌రి.. ఈ వార్త‌ల్లో  ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది. అనిల్ సుంక‌ర నిర్మిస్తున్న మ‌హేశ్ – అనిల్ రావిపూడి చిత్రం జూన్ 15 నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. 2020 సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది.

అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు! actioncutok.com

Trending now:

One thought on “అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు!

Comments are closed.