షాకింగ్: విశాల్ ‘అయోగ్య’ విడుదల ఆగిపోయింది!


మే 10న విడుదల కావాల్సిన విశాల్ సినిమా తెలీని కారణాలతో అనూహ్యంగా అందర్నీ షాక్‌గు గురిచేస్తూ ఆగిపోయింది.

షాకింగ్: విశాల్ 'అయోగ్య' విడుదల ఆగిపోయింది!
Vishal in AYOGYA

షాకింగ్: విశాల్ ‘అయోగ్య’ విడుదల ఆగిపోయింది!

కోలీవుడ్‌తో పాటు అందర్నీ షాకింగ్‌కు గురిచేస్తూ విశాల్ సినిమా ‘అయోగ్య’ విడుదల ఆగిపోయింది. షెడ్యూల్ ప్రకారం ఆ సినిమా ఈరోజు (మే 10) విడుదల కావాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందిందిన హిట్ ఫిల్మ్ ‘టెంపర్’కు రీమేక్‌గా నూతన దర్శకుడు వెంకట్ మోహన్‌తో ‘అయోగ్య’ చేశాడు విశాల్. లైట్ హౌస్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి ఈ సినిమాని నిర్మించింది.

“నా హార్డ్‌వర్క్‌కు ఫలితంగా వచ్చిన ‘అయోగ్య’ విడుదల కావాల్సి ఉంది. ఎప్పటిలా ఒక నటుడి కంటే ఎక్కువగా నా శాయశక్తులా ప్రయత్నించాను. కానీ అది సరిపోలేదు. గజిని మొహమ్మద్. నా టైం వస్తుంది. నా జర్నీ కొనసాగిస్తాను. గుడ్‌బై” అని ట్వీట్ చేశాడు విశాల్. అతను ఎవర్ని ఉద్దేశించి ‘గజిని మొహమ్మద్’ అని వ్యాఖ్యానించాడో తెలియలేదు. అయితే కావాలని కొన్ని శక్తులు నిర్మాతపై ప్రభావం చూపి, ‘అయోగ్య’ విడుదల కాకుండా ఆపారంటూ ప్రచారం జరుగుతోంది.

విడుదలకు ముందు ‘అయోగ్య’ మంచి బిజినెస్ చేసింది. తమిళనాడు థియేటర్ హక్కులు రూ. 11.5 కోట్లు, శాటిలైట్ హక్కులు రూ. 8 కోట్లు, అమజాన్ హక్కులు రూ. 4 కోట్లు, హిందీ శాటిలైట్ హక్కులు రూ. 9.5 కోట్లు, కేరళ-కర్ణాటక హక్కు, ఆడియో హక్కులు.. ఇలా మొత్తం కలుపుకొని రూ. 37 కోట్ల మేర బిజినెస్ జరిగిందని అంచనా.

‘అయోగ్య’ విడుదల ఆగడానికి కారణమేంటో, ఎప్పుడు విడుదల అవుతుందో కొన్ని గంటల్లో అధికారికంగా తెలియనున్నది.

షాకింగ్: విశాల్ ‘అయోగ్య’ విడుదల ఆగిపోయింది! | actioncutok.com

Trending now:

2 thoughts on “షాకింగ్: విశాల్ ‘అయోగ్య’ విడుదల ఆగిపోయింది!

Comments are closed.