కాటన్ స్ఫూర్తితోనే పోలవరం!


కాటన్ స్ఫూర్తితోనే పోలవరం!
Chandrababu Naidu

కాటన్ స్ఫూర్తితోనే పోలవరం!

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావది నదిపై ఆనకట్ట నిర్మించి, ఉభయ గోదావరి జిల్లాలను ధాన్యాగారాలుగా తీర్చి దిద్ది సర్ ఆర్థర్ కాటన్ చరితార్థుడు అయ్యారని ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు కొనియాడారు. బుధవారం కాటన్ జయంతి సందర్బంగా చంద్ర బాబు ఘనంగా నివాళిలర్పించారు.

కాటన్ మహాశయుని స్ఫూర్తితోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం  70 శాతం వరకు పూర్తి అయిందని తెలిపారు. జులై నుంచి గ్రావిటీ ద్వారా పోలవరం నీరు అందిస్తామని చెప్పారు. పోలవరం పూర్తయితే ఆంధ్ర రాష్ట్ర  దశ, దిశ మారిపోతుందని పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా నదుల అనుసంధాన కల నిజం చేశామని, కృష్ణా డెల్టాలో కరవు ఛాయలను తరిమికొట్టామని ఆత్మ విశ్వాసంతో చెప్పారు.

Trending now:

2 thoughts on “కాటన్ స్ఫూర్తితోనే పోలవరం!

Comments are closed.