లోకేశ్ రాహుల్‌తో అలాంటి బంధం లేదన్న ‘లెజెండ్’ హీరోయిన్!

లోకేశ్ రాహుల్‌తో అలాంటి బంధం లేదన్న ‘లెజెండ్’ హీరోయిన్!
ఇండియన్ క్రికెటర్ లోకేశ్ రాహుల్‌తో అందరూ ఊహించుకుంటున్న బంధమేదీ తనకు లేదని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన glamorous actress సోనాల్ చౌహాన్ తెలిపింది. ఎప్పుడూ కలిసి బయట కనిపించకపోయినా ఆ ఇద్ధరి మధ్య జరుగుతున్న ట్విట్టర్ సంభాషణలు వాళ్ల మధ్య అనుబంధం ఉన్నదనే ఊహలకు తావిచ్చాయి. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ లోకేశ్‌తో తాను ఎలాంటి బంధంలోనూ లేనని స్పష్టం చేసింది సోనాల్. తామిద్దరం కేవలం friends మాత్రమేనని తెలిపింది.
వి.ఎన్. ఆదిత్య డైరెక్ట్ చేసిన ‘రెయిన్బో’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది సోనాల్. తర్వాత బాలకృష్ణ జంటగా ‘లెజెండ్’లో నటించడం ద్వారా లైంలైట్‌లోకి వచ్చింది. ‘పండగ చేస్కో’, ‘షేర్’, ‘సైజ్ జీరో’, ‘డిక్టేటర్’ సినిమాల్లో నటించింది. ఒక సినీ తారతో కలిసి రాహుల్ పేరు వినిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో నిధి అగర్వాల్‌తో dating చేస్తున్నాడనే వదంతులు వినిపించాయి.
లోకేశ్ రాహుల్‌తో అలాంటి బంధం లేదన్న ‘లెజెండ్’ హీరోయిన్! | actioncutok.com
More for you: