మ‌ళ్ళీ క‌న్నేసిన ర‌జ‌నీకాంత్‌!


మ‌ళ్ళీ క‌న్నేసిన ర‌జ‌నీకాంత్‌!

మ‌ళ్ళీ క‌న్నేసిన ర‌జ‌నీకాంత్‌!

ఏడు ప‌దుల వ‌య‌సుకు చేరువ‌వుతున్నా.. ర‌జ‌నీకాంత్ దూకుడు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తూ.. అభిమానుల్లోనూ హుషారు నింపుతున్నాడు. ఆ మ‌ధ్య‌.. కేవ‌లం ఎనిమిది నెల‌ల గ్యాప్‌లోనే ‘కాలా’, ‘2.0’, ‘పేట‌’ చిత్రాల‌తో ప‌ల‌క‌రించాడు ఈ కోలీవుడ్ సూప‌ర్ స్టార్‌. ప్ర‌స్తుతం ‘ద‌ర్బార్‌’తో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఇప్ప‌టికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ డైరెక్టోరియ‌ల్ వెంచ‌ర్‌.. త్వ‌ర‌లో రెండో షెడ్యూల్‌కి ముస్తాబవుతోంది. కాగా.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే.. ఇందులో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించున్నాడ‌ట‌. అంతేకాదు.. అప్‌క‌మింగ్ షెడ్యూల్‌లో సునీల్ కూడా షూట్‌లో పాల్గొంటాడ‌ట‌.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. ‘కాలా’, ‘2.0’, ‘పేట‌’, ‘ద‌ర్బార్‌’ ఇలా ర‌జ‌నీ వ‌రుస చిత్రాల్లో బాలీవుడ్‌కి చెందిన న‌టులే విల‌న్లుగా న‌టిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ‘కాలా’లో నానా ప‌టేక‌ర్ ప్ర‌తినాయ‌కుడిగా అల‌రిస్తే.. ‘2.0’లో బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్  విల‌న్‌గా మెస్మ‌రైజ్ చేశాడు.

ఇక ‘పేట‌’లో న‌వాజుద్దీన్ సిద్ధిఖీ ఆ బాధ్య‌త‌ను కొన‌సాగిస్తే.. ఇప్పుడు ‘ద‌ర్బార్‌’లో సునీల్ వంతు. మొత్త‌మ్మీద‌.. హిందీ నాట మార్కెట్ కోస‌మో లేదంటే జ‌స్ట్ ఫ‌ర్ ఛేంజ్ కోస‌మోగానీ.. ర‌జనీ ఉత్త‌రాది న‌టుల‌పై క‌న్నేశాడ‌నే చెప్ప‌క‌త‌ప్ప‌దు. 

మ‌ళ్ళీ క‌న్నేసిన ర‌జ‌నీకాంత్‌! | actioncutok.com

More for you: