సూపర్ స్టార్.. 11వ సారి ఫిక్సయ్యాడు!


సూపర్ స్టార్.. 11వ సారి ఫిక్సయ్యాడు!

సూపర్ స్టార్.. 11వ సారి ఫిక్సయ్యాడు!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే..  ఆ రోజు థియేట‌ర్ల వ‌ద్ద పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ఇక పండ‌గ సీజ‌న్‌లోనే కొత్త చిత్రం వ‌స్తే.. మాట‌ల్లేవు, మాట్లాడుకోవ‌డాల్లేవు. అంతిమ ఫ‌లితాలు ఏవైనా.. తొలి రోజు మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల గ‌ల‌గ‌ల‌లే వినిపిస్తాయి.

ముఖ్యంగా.. పొంగ‌ల్ సీజ‌న్‌లో ర‌జ‌నీ హీరోగా వ‌చ్చిన ప‌లు చిత్రాలు త‌మిళ‌నాట రికార్డులకి కేంద్ర‌బిందువులుగా నిల‌చాయి. వాటిలో ‘బాషా’ ఒక‌టి. అంత‌టి చ‌రిత్ర ఉన్న ‘ర‌జ‌నీ-పొంగ‌ల్‌’ కాంబినేష‌న్‌లో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోంది. అదే.. ‘ద‌ర్బార్‌’.
ర‌జ‌నీకాంత్‌, పాన్-ఇండియా డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ తొలిసారి జ‌ట్టుక‌ట్టి ప‌నిచేస్తున్న‌ ఈ సినిమా.. తాజాగా ముంబైలో తొలి షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది.

రెండో షెడ్యూల్‌ని నెలాఖ‌రు నుంచి ప్లాన్ చేస్తున్నారు. ముంబై నేప‌థ్యం ఉన్న సినిమా కావ‌డం.. ర‌జ‌నీ, మురుగ‌దాస్‌కి హిందీ నాట కూడా మార్కెట్ ఉండ‌డంతో ‘ద‌ర్బార్‌’ని తెలుగు, త‌మిళ భాష‌లతో పాటు హిందీలోనూ ఒకే రోజు రిలీజ్ చేయ‌బోతున్నార‌ని టాక్‌. అలాగే ఆ రోజు కూడా డిసైడ్ అయిపోయింది.. 2020 జ‌న‌వ‌రి 9గా!

పొంగ‌ల్ సీజ‌న్‌లో ఇప్ప‌టికే 10 సార్లు ప‌ల‌క‌రించిన త‌లైవా.. ‘ద‌ర్బార్‌’తో ఏ స్థాయి విజ‌యాన్ని అందుకుంటాడోన‌ని కోలీవుడ్ వ‌ర్గాలు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి. దానికి తోడు.. లేడీ సూప‌ర్ స్టార్‌గా ఎదిగిన త‌రువాత న‌య‌న‌తార‌.. సూప‌ర్ స్టార్‌తో న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో ఆ అంచ‌నాల‌కు ఆకాశ‌మే హ‌ద్ద‌య్యింది. మ‌రి.. ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా రాబోతున్న ర‌జ‌నీ.. ఈ సారి ఏ స్థాయిలో మెస్మ‌రైజ్ చేస్తాడో వేచిచూద్దాం.

సూపర్ స్టార్.. 11వ సారి ఫిక్సయ్యాడు! | actioncutok.com

Trending now:

2 thoughts on “సూపర్ స్టార్.. 11వ సారి ఫిక్సయ్యాడు!

Comments are closed.