‘సైరా’కు వీఎఫ్ఎక్స్ టెన్షన్!


'సైరా'కు వీఎఫ్ఎక్స్ టెన్షన్!

‘సైరా’కు వీఎఫ్ఎక్స్ టెన్షన్!

చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న ‘సైరా.. నరసింహారెడ్డి’ నిర్మాణ పనులు అనుకున్న సమయానికి పూర్తయి, దసరా సీజన్‌లో విడుదల చేయగలుగుతారా?.. ఇప్పుడు చిరంజీవినీ, దర్శక నిర్మాతల్నీ వేధిస్తోన్న సందేహం ఇది. రిషూట్ల కారణంగా ప్రొడక్షన్‌లో జాప్యం జరుగుతుండం పోస్ట్ ప్రొడక్షన్‌పై ప్రభావం చూపిస్తోంది.

పోరాట సన్నివేశాలతో పాటు మరికొన్ని ఎపిసోడ్స్‌కు వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగానే అవసరమవుతోంది. సన్నివేశాల చిత్రీకరణ పూర్తయితేనే కానీ వీఎఫ్ఎక్స్ చేయడానికి వీలవదు. స్పెషల్ ఎఫెక్ట్స్ లేని సన్నివేశాల్ని ఎడిటింగ్ చేసినా, ఆ ఎఫెక్ట్స్ ఉన్న సన్నివేశాల్ని ఎడిటింగ్ చెయ్యాలంటే ముందు వీఎఫ్ఎక్స్ పూర్తవ్వాలి.

‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’ వంటి సినిమాల్లో వీఎఫ్ఎక్స్ వర్క్ ఉన్నత స్థాయిలో ఉన్నాయనే పేరొచ్చింది. ఆ స్థాయిలో వర్క్ చెయ్యాలంటే ఎక్కువ సమయం అవసరమవుతుంది. ఇదే చిరంజీవి బృందాన్ని కలవరపరుస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లో దసరాకు సినిమాని తీసుకు రావాలనేది ఆయన సంకల్పం. ఆ సీజన్ దాటితే మళ్లీ తగిన సమయం సంక్రాంతే. కానీ అప్పుడు రజనీకాంత్ ‘దర్బార్’ విడుదల ఉంది. దాంతో పోటీ పడొచ్చు కానీ అత్యంత భారీ బడ్జెట్‌తో తీస్తున్న ‘సైరా’ వసూళ్లపై దాని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. సినిమాకు అది ఏమాత్రం శ్రేయస్కరం కాదని చిరంజీవి భావిస్తున్నారు.

అందుకే వీఎఫ్ఎక్స్ బృందాన్ని అప్రమత్తం చేస్తున్నారు. సకాలంలో వీఎఫ్ఎక్స్ పనులు పూర్తవడానికి ఎంతమంది సిబ్బంది అవసరమైతే అంతమందిని ఉపయోగించైనా ఆ పనుల్ని, అదీ మంచి నాణ్యతతో పూర్తి చెయ్యాలని సూచనలు చేస్తున్నారు.

‘సైరా’కు వీఎఫ్ఎక్స్ టెన్షన్! | actioncutok.com

Trending now: