ఆటో డ్రైవర్లకు విజయ్ విందు


ఆటో డ్రైవర్లకు విజయ్ విందు

ఆటో డ్రైవర్లకు విజయ్ విందు

చెన్నయ్ : తమిళ స్టార్ హీరో విజయ్ ఆటో డ్రైవర్లకు విందు భోజనం పెట్టి తన దాతృత్వాన్ని, సేవానిరతిని చాటుకున్నాడు. ప్రతి సంవత్సరం కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయ్ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే ఒకటో తేదీన ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కారణంగా నిర్వహించలేకపోయాడు. అందుకే ఆదివారం రాష్ట్రంలోని కొందరు ఆటో డ్రైవర్లను పిలిపించి కడుపునిండా భోజనం పెట్టి కానుకలు అందచేశాడు.

ప్రస్తుతం సినిమా షూటింగులో బిజీగా ఉన్న విజయ్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయాడు. విజయ్ సెక్రటరీ బస్సి ఆనంద్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో విజయ్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. విజయ్ సేవా నిరతికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. విజయ్ నిజమైన హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆటో డ్రైవర్లకు విజయ్ విందు | actioncutok.com

More for you: