ఈసీ వైఖరి ఆందోళనకరం!

ఈసీ వైఖరి ఆందోళనకరం!
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్రమోదీకి పదే పదే క్లీన్చిట్లు ఇవ్వడం, బీజేపీ చేసిన తప్పుడు ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం ఆందోళనకు గురి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ట్వీట్టర్ వేదికగా నిరసన వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాల ఫిర్యాదుల్లో వాస్తవాలు ఉన్నా ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోకపోవడం వంటివి చూస్తుంటే కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 50శాతం వీవీప్యాట్లను లెక్కించాలని ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా విజ్ఞప్తి చేసినా ఎన్నికల సంఘం ఏమాత్రం ఖాతరు చేయకపోవడం దారుణమని విమర్శించారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతలు, అమిత్ షా ఫిర్యాదులపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించడం, టీఎంసీ నేతల ఫిర్యాదులను పక్కన పెట్టడం ఆందోళనకరమన్నారు. ప్రతిపక్షం చేసిన ఫిర్యాదులపై కూడా స్పందించి తగిన చర్యలు తీసుకుని ఎన్నికల సంఘం విశ్వసనీయతను నిరూపించుకోవాలని చంద్ర బాబు డిమాండ్ చేశారు.
ఈసీ వైఖరి ఆందోళనకరం! | actioncutok.com
Trending now: