మ‌హేశ్‌.. మ‌ళ్ళీ అలాగే!


మ‌హేశ్‌.. మ‌ళ్ళీ అలాగే!

మ‌హేశ్‌.. మ‌ళ్ళీ అలాగే!

‘రాజ‌కుమారుడు’తో క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన మ‌హేశ్ బాబు.. తాజాగా ‘మ‌హ‌ర్షి’తో పాతిక చిత్రాల మైలురాయికి చేరుకున్నాడు. ఈ జ‌ర్నీలో ప‌లు ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ సంస్థ‌ల్లో సినిమాలు చేశాడు మ‌హేశ్‌. కొన్ని చిత్రాల‌ను ఒకే నిర్మాణ సంస్థ నిర్మిస్తే.. మ‌రికొన్ని చిత్రాల‌ను రెండేసి ప్రొడ‌క్ష‌న్ హౌసెస్‌ నిర్మించాయి.

ఇక ‘మ‌హ‌ర్షి’ విష‌యంలో అయితే మూడు నిర్మాణ సంస్థ‌లు జ‌ట్టుక‌ట్టాయి. తొలిసారి రెండు నిర్మాణ సంస్థ‌లు (వైష్ణో అకాడ‌మీ, ఇందిరా ప్రొడ‌క్ష‌న్స్‌) నిర్మించిన ‘పోకిరి’ మ‌హేశ్ career లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌వ‌గా.. మొద‌టి సారి మూడు నిర్మాణ సంస్థ‌లు (వైజ‌యంతీ మూవీస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, పీవీపీ) జ‌ట్టుక‌ట్టిన ‘మ‌హ‌ర్షి’ కూడా మహేశ్ career లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌వ‌డం విశేషం.

ఈ నేప‌థ్యంలో.. ‘మ‌హ‌ర్షి’ త‌రువాత మ‌హేశ్ నుంచి రానున్న చిత్రం కూడా మూడు నిర్మాణ సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో తెర‌కెక్కుతోంద‌ట‌. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని దిల్‌ రాజు, అనిల్ సుంక‌ర నిర్మిస్తార‌ని మొద‌ట్నుంచి వార్త‌లు వ‌స్తుండ‌గా.. మ‌హేశ్ బాబు కూడా ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని తాజాగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రి.. ‘మ‌హ‌ర్షి’ హయ్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చినా రెండు మూడు చోట్ల profit వెంచ‌ర్ అని అనిపించుకోలేక‌పోయింది. కొత్త చిత్ర‌మైనా అన్ని ఏరియాల్లో లాభాల బాట ప‌డుతుందేమో  చూడాలి.

ఇదిలా ఉంటే.. మ‌హేశ్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్ మూవీ రేపు (మే 31) లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. జూలై 26 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం.

మ‌హేశ్‌.. మ‌ళ్ళీ అలాగే! | actioncutok.com

More for you: