కారు జోరు! హస్తానికి రెండు లోపే!


కారు జోరు! హస్తానికి రెండు లోపే!
Lagadapati Rajagopal

కారు జోరు! హస్తానికి రెండు లోపే!

అమరావతి : లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ లో టీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో ఆంధ్రా ఆక్టోపస్ గా పేరొందిన లగడపాటి రాజగోపాల్ విశదీకరించారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్న నేపథ్యంలో లగడపాటి ఆదివారం సాయంత్రం ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

తెలంగాణలో టీఆర్ఎస్ 14 నుంచి 16 స్థానాలు దక్కించుకుంటుందని, కాంగ్రెస్  0 నించి 2 స్థానాల్లో గెలవచ్చని అంచనావేశారు. ఏమీ రాకపోవచ్చునంటూ ఏదయినా ట్రెండ్  కాస్త అటు ఇటు అయితే ఒకటి రెండు స్థానాలు దక్కవచ్చన్నారు.  బీజేపీకి 0 నుంచి 1కి అవకాశం ఉంది కానీ అది కూడా కచ్చితంగా చెప్పలేమన్నారు.

ప్రస్తుతానికి తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు మద్దతిచ్చారనీ, అయితే ఒక సీటు మాత్రం ఎంఐఎం గెలుచుకుంటుందని, ఇది అనాదిగా వస్తున్నదేనని లగడపాటి అన్నారు.

కారు జోరు! హస్తానికి రెండు లోపే! | actioncutok.com