మహాలక్ష్మి కనిపించుట లేదు!


మహాలక్ష్మి కనిపించుట లేదు!

మహాలక్ష్మి కనిపించుట లేదు!

తమన్నా నాయికగా నటించిన ‘క్వీన్’ తెలుగు రీమేక్ ఎప్పుడు విడుదలవుతుంది? అసలు విడుదలవుతుందా, లేదా? చాలామంది మనసుల్ని తొలుస్తున్న ప్రశ్న ఇది. మార్చి 15న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. కానీ విడుదల కాలేదు.

తెలుగుతో పాటు ఏక కాలంలో అన్ని దక్షిణాది భాషల్లో ‘క్వీన్’ని రీమేక్ చేశారు. ఒకే లొకేషన్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో హీరోయిన్‌లుగా నటిస్తున్న నలుగురు తారలు తమన్నా, కాజల్, పరుల్ యాదవ్, మంజిమా మోహన్‌లతో ఆయా వెర్షన్ల డైరెక్టర్లు సీన్లు తీయడం ఇబ్బందికరమైనా అలాగే తీశారు.

అన్ని భాషల్లో మార్చి 15న సినిమాని విడుదల చేయడానికి తగ్గట్లు పాటలు, ట్రైలర్లు విడుదల చేశారు. కానీ సరైన రీతిలో బిజినెస్ కాకపోవడమో, థియేటర్ల సమస్య కారణంగానో.. ఏమైతేనేం అన్ని భాషల సినిమా విడుదల ఆగిపోయింది.

ఇప్పుడు మే నెల కూడా వచ్చేసింది. అయినా ‘దటీజ్ మహాలక్ష్మి’ ఎప్పుడు విడుదలవుతుంది, దాని అప్‌డేట్ ఏమిటి?.. అనే విషయాలు వెల్లడి కాలేదు. 2014లో వచ్చిన ‘క్వీన్’ సినిమా కంగనా రనౌత్‌ను స్టార్‌గా మార్చేసింది. ఆమె చేసిన కేరెక్టర్‌కూ, కంగన నటనకూ ప్రేక్షకులతో పాటు క్రిటిక్సూ ఫిదా అయ్యారు.

అలాంటి బలమైన కేరెక్టర్‌ను తెలుగులో చేసిన తమన్నా, దానిపై చాలా ఆశలే పెట్టుకుంది. నటిగా తనకు ‘దటీజ్ మహాలక్ష్మి’ గొప్ప పేరు తెస్తుందనుకుంటే.. అసలు ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలీని స్థితి నెలకొనడం ఆశ్చర్యకరం.

మహాలక్ష్మి కనిపించుట లేదు! | actioncutok.com

Trending now: