పాలిటిక్స్: వాజపేయి మెచ్చిన రాజీవ్ గాంధీ


రాజీవ్ గాంధీ కథ అవినీతిపరుడిగా ముగిసిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న వ్యాఖ్యలకు విరుద్ధంగా రాజీవ్‌ను వాజపేయి మెచ్చుకున్నారని బేజీపీకి చెందిన శ్రీనివాస ప్రసాద్ అనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పాలిటిక్స్: వాజపేయి మెచ్చిన రాజీవ్ గాంధీ
Rajiv Gandhi

పాలిటిక్స్: వాజపేయి మెచ్చిన రాజీవ్ గాంధీ

ఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గురించి అటల్ బీహారీ వాజపేయి వంటి పెద్ద పెద్ద నాయకులు కూడా గొప్పగా మాట్లాడిన విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలని కర్ణాటక బిజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి  శ్రీనివాస ప్రసాద్ వ్యాఖ్యానించారు. చిన్న వయసులోనే ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీని ‘భ్రష్టాచారి నెంబర్ వన్’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యపై మండిపడుతున్న కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నేత  శ్రీనివాస ప్రసాద్ స్వరం కలపటం విశేషం.

“మాజీ ప్రధాని రాజీవ్ ను శ్రీలంక తీవ్ర వాదులు కుట్ర పన్ని హత్య చేశారు. అంతేగాని ఆయన అవినీతి ఆరోపణలతో మరణించారంటే, నేనే కాదు ఈ దేశంలో ఎవ్వరూ నమ్మరు. ప్రధాని నరేంద్రమోదీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ రాజీవ్ పై అలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు” అని శ్రీనివాస  ప్రసాద్ వ్యాఖ్యానించారు.

ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ రాజీవ్ గాంధీ పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. “మీ నాన్న రాజీవ్ ను ఆయన సన్నిహితులే మిస్టర్ క్లీన్‌ అని పొగిడారు, కానీ ఆయన జీవితం భ్రష్టాచారి (అవినీతిపరుడు) నంబర్‌ వన్‌గా ముగిసింది” అంటూ తీవ్రంగా విమర్శించారు.

తాజాగా ఢిల్లీ ఎన్నికల ప్రచార సభలోనూ రాజీవ్‌ గాంధీపై మోదీ విమర్శలు చేశారు. యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను రాజీవ్‌ కుటుంబం సొంత ట్యాక్సీలా వాడుకున్నదని ఆరోపించారు. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాలిటిక్స్: వాజపేయి మెచ్చిన రాజీవ్ గాంధీ | actioncutok.com

Trending now: