‘బిగ్ బాస్ 3’ని నడిపించనున్న సీనియర్ స్టార్!


జూనియర్ ఎన్టీఆర్, నాని తర్వాత తెలుగులో బిగ్ బాస్ హౌస్‌ను నడిపించేందుకు సీనియర్ స్టార్ వెంకటేశ్ సిద్ధమవుతున్నారని సమాచారం.

'బిగ్ బాస్ 3'ని నడిపించనున్న సీనియర్ స్టార్!
Venkatesh

‘బిగ్ బాస్ 3’ని నడిపించనున్న సీనియర్ స్టార్!

నాని హోస్ట్‌గా వ్యవహరించిన ‘బిగ్ బాస్ 2’ సీజన్ చివరి ఎపిసోడ్‌లో సందడి చేసి, టైటిల్‌ను కౌశల్‌కు అందించారు సీనియర్ స్టార్ వెంకటేశ్. ఇప్పుడు ‘బిగ్ బాస్ 3’ హోస్ట్‌గా ఆయనే వ్యవహరించనున్నట్లు అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. నాలుగైదు నెలల క్రితం ఆయన పేరు వినిపించినా ఎవరూ ధ్రువీకరించలేదు.

తాజా సమాచారం ప్రకారం ‘బిగ్ బాస్’ మూడవ సీజన్‌లో కంటెస్టెంట్లకు ఆయనే పరీక్షలు పెట్టనున్నారు. తొలి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడం, అది సూపర్ హిట్ కావడం తెలిసిందే. దాంతో రెండో సీజన్‌ను కూడా ఆయనతోటే చేయించాలని ‘స్టార్ మా’ యాజమాన్యం ప్రయత్నించింది. కానీ ఆ ఆఫర్‌ను జూనియర్ సున్నితంగా తిరస్కరించాడు.

దాంతో ఆ అవకాశం నానిని వరించింది. జూనియర్ ఎన్టీఆర్ అంత ఎనర్జీ లెవల్స్ లేకపోయినా, బిగ్ బాస్ హౌస్‌ను సమర్థవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యాననిపించుకున్నాడు నాని. నిజానికి మూడో సీజన్‌ను కూడా నానితోటే నడిపించాలని మా టీవీ భావించింది. అయితే ప్రస్తుతం సినిమాలతో యమ బిజీగా ఉన్న నాని అసహాయత వ్యక్తం చేశాడు.

దాంతో తెరపై నవ్వులు పండించడంలో సిద్ధహస్తుడైన వెంకటేశ్ దీనికి తగిన వ్యక్తిగా భావించి, ఆయనను సంప్రదించారు. ఆఫర్ చేసిన రెమ్యూనరేషన్ కూడా సంతృప్తికరంగా అనిపించడంతో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం.

జూన్‌లో రిహార్సల్స్, జూలై నుంచి షూటింగ్ జరుగుతుందనీ, అదే నెలలో ప్రసారం కూడా మొదలవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

‘బిగ్ బాస్ 3’ని నడిపించనున్న సీనియర్ స్టార్! | actioncutok.com

Trending now: