సినిమా ఈవెంట్స్‌కి వెంకటేశ్ ఎంత తీసుకుంటాడు?


సినిమా ఈవెంట్స్‌కి వెంకటేశ్ ఎంత తీసుకుంటాడు?
Venkatesh

సినిమా ఈవెంట్స్‌కి వెంకటేశ్ ఎంత తీసుకుంటాడు?

సీనియర్ స్టార్ హీరోల్లో ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండేదెవరంటే ఎవరైనా వెంకటేశ్ పేరు ఠక్కున చెప్పేస్తారు. ఈ ఏడాది ‘ఎఫ్2’ రూపంలో టాలీవుడ్‌కు తొలి blockbuster ను అందించాడు వెంకటేశ్. సినిమా విజయంలో వెంకటే పాత్ర, ఆ పాత్రను వెంకటేశ్ పోషించిన తీరే కీలక పాత్ర వహించాయని ఎవరైనా చెప్పేస్తారు.

కాగా ఇటీవల వెంకటేశ్‌ను ఇండస్ట్రీలో ‘Lucky Star’గా పిలుస్తున్నారు. ఏ సినిమా ఈవెంట్‌కు వెంకటేశ్ వస్తే ఆ సినిమా హిట్టవుతుందనే పేరు వచ్చింది. దాంతో వెంకటేశ్‌ను తమ సినిమా ఈవెంట్‌కు గెస్ట్‌గా పిలవడానికి నిర్మాతలు తహతహలాడుతున్నారు. ఇటీవల ‘మజిలీ’, ‘మహర్షి’ ప్రి రిలీజ్ events కు వెంకటేశ్ అతిథిగా పాల్గొని వాటికి ఆశీర్వాదాలు అందజేసిన విషయం తెలిసిందే. ఆ రెండూ ఆ హీరోల career లో హయ్యెస్ట్ గ్రాసర్స్‌గా నిలిచాయి.

అలా అని వెంకటేశ్ ఆహ్వానించిన అందరికీ green signal ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో ఒక event లో పాల్గొనడానికి వెంకటేశ్ ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తాడో.. అనే కామెంట్స్ ఫిలింనగర్‌లో వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఆరా తీస్తే ఇప్పటివరకూ వెంకీ ఏ సినిమా ఈవెంట్‌కీ ఒక్క రూపాయి కూడా వసూలు చెయ్యలేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ event కు హాజరై ఆ సినిమా హీరో గురించీ, ఆ సినిమాకి సంబంధించిన వాళ్ల గురించీ గొప్పగా మాట్లాడటం వెంకటేశ్ మంచితనానికి నిదర్శనంగా చెప్పుకోవాలని ఆ వర్గాలు అంటున్నాయి. అదే నిజమైతే అది వెంకీ మంచితనమే.

వెంకటేశ్ ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు.

సినిమా ఈవెంట్స్‌కి వెంకటేశ్ ఎంత తీసుకుంటాడు? | actioncutok.com

More for you: