‘బ్రేక‌ప్‌’ చెప్పనున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌?


'బ్రేక‌ప్‌' చెప్పనున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

‘బ్రేక‌ప్‌’ చెప్పనున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే యువ క‌థానాయకుడు విజ‌య్ దేవ‌ర‌కొండ. చిత్ర‌చిత్ర ప్ర‌వ‌ర్ధ‌మానంగా ఎదుగుతున్న ఈ యంగ్ హీరో.. ఈ ఏడాది రెండు ఆస‌క్తిక‌ర‌మైన సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.  వాటిలో ఒక‌టి ‘డియ‌ర్ కామ్రేడ్‌’ కాగా.. మ‌రొక‌టి క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం.

జూలై 26న విడుద‌ల కానున్న‌’డియ‌ర్ కామ్రేడ్‌’లో స్టూడెంట్ యూనియ‌న్ లీడ‌ర్‌గా క‌నిపించ‌నున్న విజ‌య్‌.. క్రాంతి మాధ‌వ్ చిత్రంలో ప్లేబాయ్ త‌ర‌హా పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. కాగా..  క్రాంతి మాధ‌వ్‌, విజ‌య్ కాంబినేష‌న్ మూవీకి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి టైటిల్ ప్ర‌క‌టించ‌లేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి ‘బ్రేక‌ప్‌’ అనే పేరుని ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం.  ‘బ్రేక‌ప్‌’ చెప్ప‌డంలో స్పెష‌లిస్ట్ అయిన  యువ‌కుడి క‌థ‌తో ఈ చిత్రం రూపొందుతోంద‌ని తెలుస్తోంది. రాశీ ఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, ఇజాబెల్లి లిటీ  క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ సినిమాని క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ఏడాది చివ‌ర‌లో ‘బ్రేక‌ప్‌’ రిలీజ్ కానుంది.

‘బ్రేక‌ప్‌’ చెప్పనున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌? | actioncutok.com