మహేశ్ 26 కోసం ఆమె డిమాండ్ చేస్తోంది అంతా?!

మహేశ్ 26 కోసం ఆమె డిమాండ్ చేస్తోంది అంతా?!
తెలుగునాట ఒకనొక దశలో నంబర్ వన్ హీరోయిన్గా రాణించడమే కాదు.. అత్యధిక పారితోషికం పుచ్చుకున్న కథానాయికగానూ వార్తల్లో నిలచింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. సుదీర్ఘ కాలంగా మేకప్‌కు దూరంగా ఉన్న ఈ రాములమ్మ.. ఎట్టకేలకు ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది కూడా.. సాదా సీదా చిత్రం కోసం కాదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్. అందుకే.. తన రెమ్యూనరేషన్‌ని కూడా ఆ సినిమా స్థాయికి తగ్గట్టే డిమాండ్ చేస్తోందట విజయశాంతి.
ఆ వివరాల్లోకి వెళితే.. మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ హిలేరియస్ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి ఓ కీలక పాత్ర పోషించేందుకు పచ్చ జెండా ఊపింది. అంతేకాదు.. ఈ పాత్ర కోసం రూ.5 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తోందట.
అంత మొత్తం ఇవ్వడానికి నిర్మాత మొదట ఆలోచించినా.. లేడీ సూపర్ స్టార్ చేరిక తమ ప్రాజెక్ట్ కి మరింత ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో అంగీకారం తెలిపాడట. ఇదే గనుక నిజమైతే.. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంత మొత్తం పారితోషికం పుచ్చుకోవడం తెలుగునాట కచ్చితంగా హాట్ టాపిక్‌గా నిలచే అంశమనే చెప్పాలి. మరి.. ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే క్లారిటీ వస్తుంది.
అన్నట్లు.. ఇదే సినిమా కోసం మహేశ్ బాబు రూ.50 కోట్ల పారితోషికాన్ని, అనిల్ రావిపూడి రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి.. మహేశ్ 26 కెరీర్ బెస్ట్ రెమ్యూనరేషన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవనుందన్నమాట.
మహేశ్ 26 కోసం ఆమె డిమాండ్ చేస్తోంది అంతా?! | actioncutok.com
More for you: