క్రైం: మోజు తీసిన రెండు ప్రాణాలు!


క్రైం: మోజు తీసిన రెండు ప్రాణాలు!

క్రైం: మోజు తీసిన రెండు ప్రాణాలు!

వేలూరు (తమిళనాడు):  సంసార సంబంధాలు మరీ ఇంత పలుచనైపోవడం బాధాకరం. ఆశల దెయ్యానికి చిక్కిన స్త్రీ పురుషులు కడుపులో క్రూరత్వాన్ని పెంచుకుని హత్యలకు తెగబడుతున్నారంటే మానవ సంబంధాలు యెంత హీన స్థితికి చేరుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇందుకు దీపిక సజీవ సాక్ష్యం. ప్రియుడి మోజులో పడిన ఈ క్రూరురాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త రాజా, నవమాసాలు మోసి కన్నకొడుకును కర్కశంగా చంపేసింది.

వేలూరు జిల్లా ఆర్కాడు సమీపంలోని  తాజ్‌పురా మందవేలి ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణి కుమారుడు రాజా(25) ఎలక్ట్రీషియన్‌. రెండేళ్ల కిందట అదే ప్రాంతానికి చెందిన దీపికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఏడాది వయస్సున్న ప్రినీష్‌ అనే కుమారుడు ఉన్నాడు. సంసారం ఇలా సాగుతుండగా.. ఈ నెల 13 వ తేదీ నుంచి తన భర్త, కొడుకు కనిపించడం లేదంటూ గురువారం దొంగ ఏడుపులు ఏడుస్తూ  ఆర్కాడు పోలీసు స్టేషన్‌లో దీపిక ఫిర్యాదు చేసింది.

 అతని ఫోన్ నెంబర్ ఇస్తే అతని ఆచూకీ తెలుసుకుంటామని పోలీసులు అడిగితే, ఫోన్ ఇంటిలోనే పెట్టి వెళ్లాడని సమాధానమిచ్చింది. ఆపై పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతున్నదీపికనే అనుమానించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమ స్టయిల్లో విచారించారు. అప్పుడు అసలు నిజం కక్కింది. భర్తతో పాటు కుమారుడిని తానే హత్య చేసి ఇంటి సమీపంలోని చెరువులో పూడ్చి పెట్టినట్లు చెప్పడంతో పోలీసులు నివ్వెరపోయారు.

పూడ్చిపెట్టిన ప్రాంతం చూపాలని పోలీసులు అడగడంతో రాత్రి 11 గంటలు కావడంతో ఉదయం చూపిస్తానని చెప్పింది. రాత్రి ఆమెను స్టేషన్‌లోనే ఉంచిన పోలీసులు శుక్రవారం ఉదయం ఆ  స్థలానికి తీసుకెళ్లారు. అధికారులు మృతదేహాలను వెలికి తీయించి పరిశీలించారు. దీపికకు రాజా స్నేహితుడితో వివాహేతర సంబంధం ఉందని, ఈ కారణంతోనే భర్తతోపాటు కుమారుడిని దారుణంగా హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

క్రైం: మోజు తీసిన రెండు ప్రాణాలు! | actioncutok.com

More for you: