గవర్నర్, కేసీఆర్‌ను కలిసిన జగన్


గవర్నర్, కేసీఆర్‌ను కలిసిన జగన్

గవర్నర్, కేసీఆర్‌ను కలిసిన జగన్

హైదరాబాద్‌: వైసీపీ అధినేత, ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న  వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమై   శాసనసభాపక్ష సమావేశ తీర్మానాన్ని అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్‌ ను జగన్‌ కోరారు. వైఎస్ జగన్‌ వెంట సీనియర్ నేత, ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్ ఉన్నారు.

కేసీఆర్ కు జగన్ ఆహ్వానం

గవర్నర్, కేసీఆర్‌ను కలిసిన జగన్

గవర్నర్ తో సమావేశం ముగిసిన అనంతరం  జగన్  నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అక్కడ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రులు జగన్‌కు స్వాగతం పలికారు. జగన్‌ను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌ను ఆత్మీయంగా కౌగలించుకున్నారు. జగన్ కు స్వీట్లు తినిపించిన కేసీఆర్ శాలువా కప్పి హంసవీణ బహుకరించారు. జగన్ వెంట ఆయన భార్య భారతి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఉన్నారు. ఈ సందర్బంగా 30న విజయవాడలో జరగనున్న తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలంటూ  సీఎం కేసీఆర్‌ను జగన్ ఆహ్వానించారు.

తిరుపతికి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం తిరుపతి వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది.. అయితే కేసీఆర్‌తో పాటు మరెవరైనా వెళ్తారా లేక ఆయన ఒక్కరే వెళ్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు శ్రీ వేంకటేశ్వరస్వామికి  మొక్కు చెల్లించేందుకు కేసీఆర్  తిరుమల  వెళ్లి స్వామివారికి రూ. 5 కోట్లతో చేయించిన బంగారు ఆభరణాలు సమర్పించారు.

గవర్నర్, కేసీఆర్‌ను కలిసిన జగన్
గవర్నర్, కేసీఆర్‌ను కలిసిన జగన్

గవర్నర్, కేసీఆర్‌ను కలిసిన జగన్ | actioncutok.com

More for you: