వైసీపీ స్వీప్ చేయబోతున్నదా?


వైసీపీ స్వీప్ చేయబోతున్నదా?

వైసీపీ స్వీప్ చేయబోతున్నదా?

విశ్లేషకుల్ని సైతం విస్మయానికి గురిచేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ప్రభంజనం వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఆరంభ రౌండ్లలో అత్యధిక సీట్లలో వైసీపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. తాజా సమాచారం ప్రకారం వైసీపీ 101 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా, టీడీపీ కేవలం 21 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉండటం గమనార్హం.

తదుపరి రౌండ్లలోనూ ఇదే ధోరణి కొనసాగితే వీసీపీ స్వీప్ చేయాడం ఖాయం. ఈ ఫలితాల సరళి టీడీపీ శ్రేణుల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుండగా, వైసీపీ శ్రేణుల్ని సంబరాల్లో ముంచెత్తుతోంది. తొలి రౌండ్‌లో కుప్పం నియోజక వర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వల్ప ఓట్ల తేడాతో వెనుకంజ వేయడంతో టీడీపీ వర్గాలు అందోళన చెందాయి. అయితే తర్వాతి రౌండ్లలో చంద్రబాబు ఆధిక్యంలోకి వచ్చారు. ప్రస్తుతానికి ఆయన 1500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

అవినీతి రహిత సమాజమే ధ్యేయంగా రాజకీయాల్లో అడుగుపెట్టినట్లు చెప్పుకున్న పవన్ కల్యాణ్ పార్టీ జనసేన పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్లు కనిపిస్తోంది. స్వయంగా పవన్ కల్యాణ్ ఓటమి ఎదుర్కొనే దిశగా కొనసాగుతున్నారు. భీమవరంలో ఆయన బాగా వెనుకబడిపోగా, గాజువాకలో ఆయన స్థితి ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతోంది.

చూస్తుంటే వైఎస్ జగన్మోహనరెడ్డి సమ్మోహన శక్తి ఈసారి ఎన్నికలను ప్రభావితం చేసినట్లు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహనరెడ్డి శకం మొదలైనట్లు ఓట్ల సరళి తెలియజేస్తోంది. ఇది నవశకానికి దారి తీస్తుందా? చూడాలి.

వైసీపీ స్వీప్ చేయబోతున్నదా? | actioncutok.com