ఆ 10 సీక్వెల్ కేరెక్టర్లు ఒరిజినల్‌ను మించిపోయాయి!


– కార్తికేయ
ఆ 10 సీక్వెల్ కేరెక్టర్లు ఒరిజినల్‌ను మించిపోయాయి!
T-800 in Terminator 2

ఆ 10 సీక్వెల్ కేరెక్టర్లు ఒరిజినల్‌ను మించిపోయాయి!

ఒరిజినల్ కంటే సీక్వెల్ మరింత బాగా ఉండటం అరుదైన విషయం. అలాగే ప్రధాన పాత్రలు ఒరిజినల్ కంటే సీక్వెల్‌లో మరింత ఆకర్షణీయంగా, మరింత ప్రభావవంతంగా రూపొందడం కూడా అరుదే. అలా కొన్ని కేరెక్టర్లు సీక్వెల్స్‌లో మొదటి సినిమాకి మించి రాణించాయి, ప్రేక్షకుల్ని అలరించాయి. అలాంటి 10 కేరెక్టర్లేవో, ఆ సినిమాలేమిటో చూద్దాం.

1. టి-800: ఆర్నాల్డ్ షార్జ్‌నెగ్గర్ పోషించిన ఈ కేరెక్టర్ ‘ద టెర్మినేటర్’ (1984)ని మించి ‘టెర్మినేటర్ 2: జడ్జ్‌మెంట్ డే’ (1991)లో ఇంకా ఎక్కువగా ఆకట్టుకుంది.

2. ల్యూక్ స్కైవాకర్: మార్క్ హామిల్ మొదటిసారి పోషించిన స్కైవాకర్ కేరెక్టర్ ‘స్టార్ వార్స్’ (1977)లోనే ఆకట్టుకోగా, ట్రైలాజీలోని మూడో సినిమా ‘రిటర్న్ ఆఫ్ ద జెడి’ (1983)లో మరింత బాగా ఆకట్టుకోవడానికి డైరెక్టర్ జార్జ్ లూకాస్ ఆ కేరెక్టర్‌ను తీర్చిదిద్దిన విధానమే కారణం.

ఆ 10 సీక్వెల్ కేరెక్టర్లు ఒరిజినల్‌ను మించిపోయాయి!

3. థోర్: 2011లో వచ్చిన ‘థోర్’ సినిమాలో టైటిల్ రోల్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. క్రిస్ హెమ్స్‌వర్త్‌ను సూపర్‌స్టార్‌ను చేసిన కేరెక్టర్ అది. అయితే ఒరిజినల్‌ను మించి ‘థోర్: రగ్నరోక్’లో ఆ కేరెక్టర్ మరింతగా ప్రేక్షకుల్ని అలరించింది.

4. రిక్ డెకార్డ్: ‘బ్లేడ్ రన్నర్’ (1982) సినిమాలో హారిసన్ ఫోర్డ్ పోషించిన డెకార్డ్ కేరెక్టర్‌తో ప్రేక్షకులు బాగా కనెక్టయ్యారు. 35 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ ‘బ్లేడ్ రన్నర్ 2049’లో ఆ కేరెక్టర్‌ను ఇంకా ఎక్కువగా ప్రేమించారు.

5. డెడ్‌పూల్: వేడ్ విల్సన్ అలియాస్ డెడ్‌పూల్ కేరెక్టర్‌లో ర్యాన్ రేనాల్డ్స్ అమితంగా రాణించాడు. అదే పేరుతో ఒరిజినల్ 2016లో రాగా, 2018లో వచ్చిన ‘డెడ్‌పూల్ 2’లో ఆ కేరెక్టర్ ఇంకా ఎక్కువ ఆకట్టుకుంది.

ఆ 10 సీక్వెల్ కేరెక్టర్లు ఒరిజినల్‌ను మించిపోయాయి!
Godfather Part II

6. మైఖెల్ కొర్లియోన్: ఆల్ టైం గ్రేటెస్ట్ ఫిలిమ్స్‌గా విమర్శకుల నీరాజనాలు అందుకున్న ఫ్రాన్సిస్  ఫోర్డ్ కొప్పోలా సినిమాలు ‘ద గాడ్‌ఫాదర్’, ‘ద గాడ్‌ఫాదర్ పార్ట్ II’లో డాన్‌గా మైఖెల్ కొర్లియోన్ ఎలా ఎదిగాడో, ఎలా పతనమయ్యాడో చూశాం. మొదటి దాన్ని మించి రెండో సినిమాలో ఆ కేరెక్టర్ మనల్ని మరింతగా ప్రభావితం చేస్తుంది. ఆ పాత్రలో అల్ పాసినో నటన అత్యుత్తమం.

7. జాక్ జాక్: యానిమేషన్ క్లాసిక్ ‘ది ఇంక్రెడిబుల్స్’ (2004)లో శిశువుగా ముద్దుముద్దుగా ఆకట్టుకున్న జాక్ జాక్ కేరెక్టర్, 2018లో వచ్చిన ‘ఇంక్రెడిబుల్స్ 2’లో తన అపూర్వ శక్తులతో మరింత బాలా అలరించాడు.

8. రాకీ: సిల్వెస్టర్ స్టాలోన్ పోషించిన పాత్రల్లో జాన్ రాంబో కేరెక్టర్ ఎంత ప్రసిద్ధి చెందిందో బాక్సర్ రాకీ కేరెక్టర్ అంతగానూ పేరు తెచ్చుకుంది. 1976లో వచ్చిన ఒరిజినల్ ‘రాకీ’ని మించి 1982లో వచ్చిన ‘రాకీ III’ మరింతగా చెలరేగిపోయాడు.

ఆ 10 సీక్వెల్ కేరెక్టర్లు ఒరిజినల్‌ను మించిపోయాయి!

9. నెబ్యులా: ‘గార్డియన్స్ ఆఫ్ ద గాలక్సీ’ (2014)లో నెబ్యులా కేరెక్టర్ మన మనసులపై ముద్ర వేసింది. ఇక ఈ మధ్య వచ్చి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించిన ‘అవెంజెర్స్: ఎండ్‌గేం’లో ఆ కేరెక్టర్ మరింతగా ఆకట్టుకుంది. ఆ పాత్రలో కరెన్ గిల్లన్ గొప్పగా రాణించింది.

10. యాష్ విలియమ్స్: సాం రైమి డైరెక్ట్ చేసిన ‘ఈవిల్ డెడ్’ (1981)లో యాష్ కేరెక్టర్‌ను ఎవరు మర్చిపోతారు! ఆ పాత్రలో బ్రూస్ కేంప్‌బెల్ నటన మనల్ని వెంటాడింది. అయితే అంతకు మించి ‘ది ఈవిల్ డెడ్ 2′(1987)లో ఆ కేరెక్టర్ ఇంకా మెప్పించింది.

ఆ 10 సీక్వెల్ కేరెక్టర్లు ఒరిజినల్‌ను మించిపోయాయి! | actioncutok.com

More for you: