విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆటో: ఐదుగురి మృతి


విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆటో: ఐదుగురి మృతి

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆటో: ఐదుగురి మృతి

విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చెరువూరు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొనడంతో మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలోని 11 మంది ప్రయాణికులు చింతపల్లి సంతకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు క్షతగాత్రులు తెలిపారు. గాయపడిన వాళ్లను మొదట స్థానిక ఆసుపత్రికి, అక్కడ్నుంచి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఆటోను డ్రైవర్ వేగంగా నడపడంతో అదుపుతప్పి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దాంతో మంటలు చెలరేగడంతో పాటు, విద్యుత్ వైర్లు తెగి మీదపడటంతో షాక్‌కు గురై ఐదుగురు ప్రయాణీకులు మృతి చెందారు. ప్రయాణీకులంతా సమీప గ్రామాల గిరిజనులే.

ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై విశాఖ కలెక్టర్‌తో మాట్లాడిన ఆయన బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆటో: ఐదుగురి మృతి | actioncutok.com

More for you: