మెగాస్టార్‌తో రంగమ్మత్త?

మెగాస్టార్‌తో రంగమ్మత్త?
బుల్లితెర నుంచి వెండితెరకు ఎదిగిన వైనం అనసూయ సొంతం. ‘జబర్దస్త్’ టీవీ షోతో పాపులారిటీ పొందిన అను.. ఆ షో పుణ్యమా అని సినిమా అవకాశాలను దక్కించుకుంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘క్షణం’, ‘విన్నర్’ (ప్రత్యేక గీతం), ‘గాయత్రి’, ‘రంగస్థలం’, ‘ఎఫ్ 2’, ‘యాత్ర’.. ఇలా పలు చిత్రాల్లో సందడి చేసిన అనసూయకి.. ‘రంగస్థలం’లోని రంగమ్మత్త పాత్ర ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది.
ప్రస్తుతం ‘కథనం’, ‘సచ్చిందిరా గొర్రె’ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకి.. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించే ఛాన్స్ దక్కిందని సమాచారం. అది కూడా.. కథలో చాలా కీలకంగా వచ్చే పాత్ర అట.
ఆ డిటైల్స్‌లోకి వెళితే, చిరంజీవి హీరోగా కొరటాల శివ ఓ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 22 నుంచి పట్టాలెక్కనున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం అనసూయని సంప్రదించాడట కొరటాల. కథ, తన పాత్ర నచ్చడం.. చిరు హీరో కావడంతో వెంటనే పచ్చ జెండా ఊపేసిందట అనసూయ. అంతేకాదు, ఈ చిత్రం కోసం భారీ మొత్తాన్నే అందుకోబోతోందట.
నాగార్జున, వెంకటేశ్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించి విజయాలు అందుకున్న అనసూయ.. చిరు కాంబినేషన్లోనూ మంచి సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి మరి.
మెగాస్టార్‌తో రంగమ్మత్త? | actioncutok.com
More for you: