ఫైన‌ల్‌గా బాలయ్య ఫిక్స్ అయ్యాడంటున్నారు!


ఫైన‌ల్‌గా బాలయ్య ఫిక్స్ అయ్యాడంటున్నారు!
Balakrishna

ఫైన‌ల్‌గా బాలయ్య ఫిక్స్ అయ్యాడంటున్నారు!

‘య‌న్టీఆర్‌’ బ‌యోపిక్ త‌రువాత మ‌ళ్ళీ మేక‌ప్ వేసుకోని బాల‌కృష్ణ‌.. దాదాపు నాలుగు నెల‌ల త‌రువాత  సెట్స్ పైకి వెళ్ళ‌నున్నాడట‌. అంతేకాదు, ‘జై సింహా’తో త‌న‌కు క‌లిసొచ్చిన యూనిట్ (ద‌ర్శ‌కుడు కె.య‌స్‌.ర‌వికుమార్‌,  నిర్మాత సి.క‌ల్యాణ్‌, సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్‌)తో త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు బాల‌య్య‌. వాస్త‌వానికి, ఈ పాటికే ప‌ట్టాలెక్కాల్సిన ఈ సినిమా.. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని బాల‌కృష్ణ పుట్టిన‌రోజు (జూన్ 10) అనంత‌రం అంటే జూన్ 12న లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నార‌ట‌. అలాగే, నెలాఖ‌రు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టి మెరుపువేగంతో సినిమాని పూర్తిచేయాల‌ని యూనిట్ భావిస్తోంద‌ట‌. అంతేకాదు, మొద‌ట అనుకున్న‌ట్లుగా సంక్రాంతి సీజ‌న్‌లోనే ప‌ల‌క‌రించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయని తెలిసింది.

కాగా, ‘రూల‌ర్’ అనే టైటిల్‌ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ సినిమాలో పాయ‌ల్ రాజ్‌పుత్‌, మెహ‌రీన్ క‌థానాయిక‌లుగా న‌టించ‌నున్నార‌ని స‌మాచారం.

ఫైన‌ల్‌గా బాలయ్య ఫిక్స్ అయ్యాడంటున్నారు! | actioncutok.com

More for you: