వరుసగా ఐదోసారి సంక్రాంతి బరిలో..!

వరుసగా ఐదోసారి సంక్రాంతి బరిలో..!
అగ్ర కథానాయకులలో నందమూరి బాలకృష్ణ జోరే వేరు. ఇప్పటికీ ప్రతీ ఏటా కనీసం ఒక్క సినిమాతోనైనా ప్రేక్షకులను పలకరించేలా తన కెరీర్ను ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు ఈ సీనియర్ హీరో. ఈ సంవత్సరంలో ఇప్పటికే ‘యన్టీఆర్ కథానాయకుడు’, ‘యన్టీఆర్ మహానాయకుడు’తో అభిమానులను అలరించిన బాలయ్య.. ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ‘క్రాంతి’ (ప్రచారంలో ఉన్న పేరు) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పట్టాలెక్కిన ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. బాలయ్యకు, సంక్రాంతికి విడదీయరాని అనుబంధం ఉందన్న విషయం విదితమే. కెరీర్లో పలు సార్లు సంక్రాంతికి సందడి చేయడమే కాకుండా విజయాలూ అందుకున్నాడు ఈ నందమూరి హీరో. ముఖ్యంగా.. ‘సమరసింహారెడ్డి’ (13.01.1999), ‘వంశోద్ధారకుడు’ (14.01.2000), ‘నరసింహనాయుడు’ (11.01.2001), ‘సీమసింహం’ (11.01.2002).. ఇలా వరుసగా నాలుగేళ్ల పాటు సంక్రాంతికి సందడి చేసి అప్పట్లో వార్తల్లో నిలిచాడు బాలయ్య. కట్ చేస్తే.. సుదీర్ఘ విరామం తరువాత ఇప్పుడు తన కెరీర్లో మొదటిసారిగా వరుసగా ఐదోసారి సంక్రాంతికి పలకరించే దిశగా అడుగులు వేస్తున్నాడు బాలయ్య.
ఆ డిటైల్స్లోకి వెళితే.. ‘డిక్టేటర్’ (14.01.2016), ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ (12.01.2017), ‘జైసింహా’ (12.01.2018), ‘యన్టీఆర్ కథానాయకుడు’(09.01.2019).. ఇలా నాలుగేళ్ళగా ముగ్గుల పండక్కి పలకరిస్తూ వస్తున్న బాలయ్య.. 2020లో ‘క్రాంతి’తో వరుసగా ఐదోసారి సంక్రాంతికి రాబోతున్నాడు.
మొత్తమ్మీద.. తన కెరీర్లో తొలిసారిగా వరుసగా ఐదేళ్ళ పాటు సంక్రాంతికి సందడి చేయడం బాలయ్యకే కాదు, అతని అభిమానులకూ ప్రత్యేకమైన అంశమే.
వరుసగా ఐదోసారి సంక్రాంతి బరిలో..! | actioncutok.com
More for you: