బెల్లంకొండ‌కి రెండోసారైనా వ‌ర్కవుట్ అవుతుందా?


బెల్లంకొండ‌కి రెండోసారైనా వ‌ర్కవుట్ అవుతుందా?

బెల్లంకొండ‌కి రెండోసారైనా వ‌ర్కవుట్ అవుతుందా?

‘అల్లుడు శీను’ (2014)తో క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేసిన బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌.. ఆ సినిమా విడుద‌లై ఐదేళ్ళు అవుతున్నా ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క హిట్ కొట్టలేదు. ‘అల్లుడు శీను’, ‘జ‌య జాన‌కి నాయ‌క‌’కి టాక్‌, వ‌సూళ్ళు బాగానే వ‌చ్చినా.. కాస్ట్ ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. ఇక ‘స్పీడున్నోడు’, ‘సాక్ష్యం’, ‘క‌వ‌చం’, ‘సీత‌’ గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ఈ నేప‌థ్యంలో.. ‘రాక్ష‌సుడు’తో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు సాయి శ్రీ‌నివాస్‌. త‌మిళంలో విజ‌యం సాధించిన‌న ‘రాక్ష‌స‌న్‌’కి రీమేక్ వెర్ష‌న్‌గా రూపొందిన ఈ చిత్రం జూలై 18న రిలీజ్ కానుంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకి ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ ఆస‌క్తి రేకెత్తించ‌డంతో.. ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్ రిజ‌ల్ట్‌నే ఇక్క‌డా రిపీట్ అవుతుంద‌ని మేక‌ర్స్ ఆశాభ‌వం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే, బెల్లంకొండ‌కి రీమేక్‌లో న‌టించ‌డం అంత‌గా క‌ల‌సి రాలేద‌నే చెప్పాలి. త‌న రెండో చిత్రం ‘స్పీడున్నోడు’.. త‌మిళ చిత్రం ‘సుంద‌ర‌పాండియ‌న్‌’కి రీమేక్‌గా తెర‌కెక్కి డిజాస్ట‌ర్‌గా నిల‌చింది. మ‌రి.. మూడేళ్ళ త‌రువాత మ‌ళ్ళీ త‌మిళ చిత్రం రీమేక్‌తోనే అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్న బెల్లంకొండ ఈ సారైనా విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

బెల్లంకొండ‌కి రెండోసారైనా వ‌ర్కవుట్ అవుతుందా? | actioncutok.com

More for you: