వసూళ్లలో దూసుకుపోతున్న ‘భారత్’


వసూళ్లలో దూసుకుపోతున్న 'భారత్'

వసూళ్లలో దూసుకుపోతున్న ‘భారత్’

సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘భారత్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రివ్యూలకు భిన్నంగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దేశవ్యాప్తంగా 4000 స్క్రీన్స్‌లో రిలీజైన ఈ సినిమా ఐదు రోజుల ఓపెనింగ్ వీకెండ్‌లో రూ. 150 కోట్ల మార్కును దాటి ఈ ఫీట్ సాధించిన సల్మాన్ రెండో సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇదివరకు ‘సుల్తాన్’ సినిమా రూ. 180.36 కోట్లను వసూలు చేసి, అగ్ర స్థానంలో ఉంది.

ఇప్పటివరకూ ఓపెనింగ్ వీకెండ్ వసూళ్ల పరంగా రూ. 129.77 కోట్లతో రెండో స్థానంలో ఉన్న ‘ప్రేం రతన్ ధన్ పాయో’ సినిమాని రూ. 150.10 కోట్లతో ‘భారత్’ వెనక్కి నెట్టివేసింది. త్వరలోనే ఈ సినిమా రూ. 200 కోట్ల మార్కును దాటనున్నది.

ఓపెనింగ్ వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సల్మాన్ టాప్ 10 సినిమాలు:

సుల్తాన్ – రూ. 180.36 కోట్లు

భారత్ – రూ. 150.10 కోట్లు

ప్రేం రతన్ ధన్ పాయో – రూ. 129.77 కోట్లు

టైగర్ జిందా హై – రూ. 114.93 కోట్లు

రేస్ 3 – రూ. 106.47 కోట్లు

బజరంగీ భాయీజాన్ – రూ. 102.60 కోట్లు

ఏక్ థా టైగర్ – రూ. 100.16 కోట్లు

బాడీగార్డ్ – రూ. 88.75 కోట్లు

కిక్ – రూ. 83.83 కోట్లు

దబాంగ్ 2 – రూ. 65 కోట్లు

వసూళ్లలో దూసుకుపోతున్న ‘భారత్’ | actioncutok.com

More for you: