నిర్మాతగా మారుతున్న పవన్ కల్యాణ్ డైరెక్టర్


నిర్మాతగా మారుతున్న పవన్ కల్యాణ్ డైరెక్టర్
Bobby

నిర్మాతగా మారుతున్న పవన్ కల్యాణ్ డైరెక్టర్

దర్శకులు నిర్మాతలుగా మారుతుండటం టాలీవుడ్‌లో ఒక ట్రెండ్‌గా మారినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు పేరుపొందిన దర్శకులు నిర్మాతల అవతారమెత్తి, సొంత బేనర్లపైనే సినిమాలు రూపొందిస్తున్నారు. మరికొందరు వేరే డైరెక్టర్లు తీసే సినిమాలను నిర్మిస్తున్నారు. ఇటీవలే టాప్ డైరెక్టర్ కొరటాల శివ నిర్మాతగా మారుతున్న విషయాన్ని తెలుసుకున్నాం. తాజాగా మరో డైరెక్టర్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అతను కె.ఎస్. రవీంద్ర అలియాస్ బాబీ.

అరుణ్ పవార్ డైరెక్ట్ చేయనున్న సినిమాని బాబీ నిర్మించనున్నాడు. ‘బెస్ట్ యాక్టర్స్’, ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమాల్ని రూపొందించిన అరుణ్ పవార్ తాజా చిత్రం ‘వజ్రకవచధర గోవిద’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత అరుణ్ డైరెక్ట్ చేసే సినిమాని బాబీ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ పేరున్న హీరో నటించనున్నట్లు సమాచారం.

మరోవైపు ‘పవర్’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘జై లవకుశ’ సినిమాల తర్వాత ఇప్పుడు వెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్‌తో ‘వెంకీ మామ’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు బాబీ.

నిర్మాతగా మారుతున్న పవన్ కల్యాణ్ డైరెక్టర్ | actioncutok.com

More for you: