‘చిరు 152’కి ముహూర్తం ఫిక్స్‌


'చిరు 152'కి ముహూర్తం ఫిక్స్‌

‘చిరు 152’కి ముహూర్తం ఫిక్స్‌

‘ఖైదీ నంబ‌ర్ 150’తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ప్ర‌స్తుతం హిస్టారిక‌ల్ డ్రామా ‘సైరా..న‌ర‌సింహారెడ్డి’తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ నెలాఖ‌రులోపు ఈ సినిమాకి సంబంధించిన‌ చిత్రీక‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌న్నీ(ప్యాచ్ వ‌ర్క్‌తో స‌హా) పూర్త‌యిపోతాయ‌ని టాక్‌. అనంత‌రం స్వ‌ల్ప విరామం తీసుకుని.. కొర‌టాల శివ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించ‌నున్నాడు చిరు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. చిరు, కొర‌టాల కాంబినేష‌న్ మూవీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింద‌ని తెలిసింది. చిరు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు 22న ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌వుతుంద‌ట‌. అలాగే.. అదే నెలాఖ‌రు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లుపెడ‌తార‌ని టాక్‌.

ఆపై నిర‌వ‌ధికంగా చిత్రీక‌ర‌ణ జ‌రిపి వ‌చ్చే ఏడాది వేస‌వి ఆరంభంలో ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం.  కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై త్వ‌ర‌లోనే ఫుల్ క్లారిటీ రానుంది.

‘చిరు 152’కి ముహూర్తం ఫిక్స్‌ | actioncutok.com

More for you: