‘సాహో’ కోసం ‘దిల్’ రాజు చేస్తోంది సాహ‌సమా? దుస్సాహసమా?


‘సాహో’ కోసం ‘దిల్’ రాజు చేస్తోంది సాహ‌సమా? దుస్సాహసమా?
Dil Raju

‘సాహో’ కోసం ‘దిల్’ రాజు చేస్తోంది సాహ‌సమా? దుస్సాహసమా?

‘దిల్’ రాజు.. క్రేజీ కాంబినేషన్స్‌ను సెట్ చేసి ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్‌గా ఆ సినిమాలను మలచుకుని.. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్. అయితే, తన నిర్మాణంలో రూపొంద‌ని ఎగ్జైటింగ్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌కు  డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించి అటువంటి ప్రాజెక్ట్స్‌లో కూడా భాగస్వామి అవ‌డం ఆయనకు ఫిల్మ్‌తో పెట్టిన విద్య‌.

ఈ నేప‌థ్యంలోనే.. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’  డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్ కోసం పెద్ద అమౌంట్‌నే ఆఫ‌ర్ చేసాడట ‘దిల్’ రాజు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. నైజాం, ఉత్తరాంధ్ర హక్కుల్ని నిర్మాత రాజు.. 2:1 నిష్పత్తిలో రూ.45 కోట్లకు కైవసం చేసుకున్నాడని టాక్. బాహుబలేతర సినిమాలకు సంబంధించి ఈ రెండు ఏరియాల‌ను కలుపుకుని ఇంత‌పెద్ద పెద్ద‌ అమౌంట్‌ను ఆఫ‌ర్ చేయడం సాహ‌స‌మ‌నే అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఇంత రిస్క్ చేస్తున్న ‘దిల్’ రాజుకి ‘సాహో’ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.

హాలీవుడ్ రేంజ్‌ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్న‘సాహో’లో ప్ర‌భాస్‌కు జోడీగా శ్ర‌ధ్ధా క‌పూర్ న‌టిస్తుండ‌గా.. నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. అరుణ్ విజయ్, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్, జాకీ ష్రాఫ్, చంకీ పాండే, ‘వెన్నెల’ కిషోర్, మురళీశర్మ త‌దిత‌రులు ముఖ్య భూమికలను పోషించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్.. స్కై హై ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

‘సాహో’ కోసం ‘దిల్’ రాజు చేస్తోంది సాహ‌సమా? దుస్సాహసమా? | actioncutok.com

More for you: