అరే.. ఆ డైరెక్టర్ మొదటికొచ్చాడు!


– వనమాలి
అరే.. ఆ డైరెక్టర్ మొదటికొచ్చాడు!
Chandoo Mondeti

అరే.. ఆ డైరెక్టర్ మొదటికొచ్చాడు!

డైరెక్టర్ పరశురామ్ దగ్గర ‘యువత’, ‘సోలో’ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి, ‘కార్తికేయ’ (2014) అనే థ్రిల్లర్‌తో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు చందూ మొండేటి. నిఖిల్, స్వాతి జంటగా సుబ్రహ్మణ్యస్వామి గుడి కేంద్రంగా నడిచే మిస్టరీతో ఆ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. దాంతో ‘కార్తికేయ డైరెక్టర్’గా గుర్తింపు పొందాడు చందూ.

రెండో సినిమా కోసం ఒక రీమేక్‌ని ఎంచుకున్నాడు. అది మలయాళంలో ఘన విజయం సాధించి, సాయిపల్లవి అనే నటిని చిత్రసీమకు పరిచయం చేసిన ‘ప్రేమమ్’. తెలుగులోనూ అదే పేరుతో నాగచైతన్యతో ఆ సినిమాని రూపొందిన్ మరో హిట్ కొట్టాడు చందూ. దాంతో అతడి తదుపరి సినిమానీ తనతోనే చేయించుకున్నాడు చైతన్య. పేరుపొందిన తమిళ నటుడు మాధవన్‌ను తెలుగు తెరకు విలన్‌గా పరిచయం చేసిన ఆ సినిమా ‘సవ్యసాచి’ (2018). కానీ అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

‘ప్రేమమ్’ తర్వాత పెద్ద డైరెక్టర్‌గా ఎదుగుతాడనీ, స్టార్ హీరోలు అతనికి ఛాన్స్ ఇస్తారనీ చాలామంది నమ్మారు. కానీ ‘సవ్యసాచి’ తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. స్టార్ హీరోలెవరూ అతనికి కబురు చెయ్యలేదు. ఎవరూ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

దాంతో దర్శకుడిగా తన తొలిచిత్ర కథానాయకుడు నిఖిల్‌నే అప్రోచయ్యాడు. కథ చెప్పాడు. నిఖిల్ ఓకే అనేశాడు. తీరా చూస్తే.. అది ‘కార్తికేయ’కు సీక్వెల్. అంటే ఎక్కడ్నుంచి మొదలయ్యాడో అక్కడికే వచ్చాడన్న మాట. తొలి సినిమా హీరో, తొలి సినిమాకి సీక్వెల్! మరోసారి మిస్టరీ థ్రిల్లర్‌నే నమ్ముకొని ఆత మొదలుపెట్టాడు చందూ. ఈ ఆటలో అతడు విజయం సాధించి, డైరెక్టర్‌గా తనపై నెలకొన్న సందేహాల్ని పటాపంచలు చేస్తాడా? చూడాలి.

అరే.. ఆ డైరెక్టర్ మొదటికొచ్చాడు!
A still from Karthikeya

అరే.. ఆ డైరెక్టర్ మొదటికొచ్చాడు! | actioncutok.com

More for you: