అతను పట్టు వదలడు.. మనకు తిప్పలు తప్పవు!


– వనమాలి
అతను పట్టు వదలడు.. మనకు తిప్పలు తప్పవు!
Havish

అతను పట్టు వదలడు.. మనకు తిప్పలు తప్పవు!

పట్టువదలని విక్రమార్కులు కొందరుంటారు. నటన సరిగా రాకపోయినా, నటనలో అపరిపక్వత కనిపిస్తున్నా, ప్రేక్షకులు తిరస్కరిస్తున్నా.. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎలాగైనా హీరో అనిపించుకోవాలని, ఒక్క విజయం సాధించాలని తపిస్తుంటారు. ఆ కోవకు చెందిన నటుడే హవీష్!

ఎనిమిదేళ్ల క్రితం ‘నువ్విలా’ సినిమాతో హీరోగా పరిచయమై మొద్దబ్బాయిలా కనిపించిన హవీష్.. ఆ తర్వాత నటించింది కేవలం మూడు సినిమాలే. రెండో సినిమా ‘జీనియస్’ (2012)ను ఎంత డబ్బు ఖర్చు పెట్టి తీసినా, చిన్నికృష్ణ కథతో రూపొందించినా ఫలితం లేకుండాపోయింది.

ఆ పైన మూడేళ్ల గ్యాప్ తీసుకొని ‘రాంలీలా’ అనే సినిమా చేశాడు. ఊహు.. మునుపటి సినిమాల కన్నా ఘోర ఫలితం. ఇక లాభం లేదనుకొని తమ వ్యాపారాలు చూసుకుంటూ వస్తున్న అతను మళ్లీ ‘7’ సబ్జెక్ట్‌కి టెంప్టయి, ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదివరకు సినిమాల్లో ఎలా కనిపించాడో, నటించాడో.. ఇప్పుడూ అంతే. మహా అయితే నటుడిగా చీమ సైజంత మెరుగయ్యాడేమో.

రెజీనా కసాండ్రా పాత్ర, ఆ పాత్రలో ఆమె నటన మినహా చెప్పుకోడానికి పెద్దగా ఏమీ లేని మిస్టరీ సినిమాలో ప్రేక్షకుల్ని హవీష్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అతనిలో హీరో మెటీరియల్ లేదని తెలిసిపోతూ ఉంది. ‘7’ సినిమా పొరపాటున ఆడిందంటే వెంటనే హవీష్ నుంచి మరో సినిమా వచ్చేసినట్లే. ఆడకపోతే, మళ్లీ రెండేళ్లకో, మూడేళ్లకో ఇంకో సినిమాతో విక్రమార్కుడిలా మనముందుకు వస్తాడు. మనం భరించక తప్పదు.

అతను పట్టు వదలడు.. మనకు తిప్పలు తప్పవు! | actioncutok.com

More for you: