మంచి కథ ఎలా వస్తుంది?
– సజ్జా వరుణ్

మంచి కథ ఎలా వస్తుంది?
ఈ మధ్య వస్తున్న సినిమాలు అనుకున్న కాన్సెప్టుకీ, దానికిస్తున్న ట్రీట్మెంట్కీ సంబంధం లేకుండా ఉంటున్నాయి. రాసే రచయితతో పాటు రాయని ఇంకెందరో రచయితలు ఉంటున్నందువల్ల సినిమా కథకి ఈ సమస్య తప్పదు. కాబట్టి కాన్సెప్టుకిస్తున్న ట్రీట్మెంట్ మీద ఎందరి చేతులు పడినప్పటికీ, వాటి సంబంధం చెడకుండా, మొత్తంగా కథ నాణ్యత దెబ్బతినకుండా ఎలా కాపాడుకోవాలి?
టాలీవుడ్‌ని బెంబేలెత్తిస్తున్న ఫ్లాపుల శాతాన్ని తగ్గించుకోవాలన్నా కూడా పరిష్కారం కావాలి. తెలుగు సినిమా పుట్టి 87 ఏళ్లు దాటిపోయినా ఇప్పటికీ ఎక్కువమంది అనుభవాల మీద ఆధారపడి సినిమాలు తీస్తున్నారు. సినిమా సైన్స్ గురించి తెలిసినవాళ్ల సంఖ్య తక్కువ. ఈ రోజుల్లో కళాఖండాలనదగ్గ సినిమాలు ఎవరూ తియ్యడం లేదు. అందువల్ల గొప్ప కథల గురించి బుర్ర బద్దలు కొట్టుకోకుండా ఒద్దికగా ‘మజిలీ’ లాంటి, ‘జెర్సీ’ లాంటి మంచి కథలు అందించగలిగితే చాలు.
మరైతే మంచి కథ ఎలా పుడుతుంది? మొదట గొప్పగా ఊహించగలిగితే నాణ్యత ఓ మెట్టు దిగినా, మంచి కథ ఎక్కడికీ పోదు. అప్పటికీ చేతులు ఊరుకోక ఇంకా కిందికి లాగితే.. మంచి కథ కాస్తా చెత్త ట్రీట్మెంట్తో అట్టర్ ఫ్లాపవకుండా ఉండదు.

మొదట సినిమా అంటే మనిషి మనసు లోపలి ప్రపంచాన్ని ఆవిష్కరించే శాస్త్రమనే విషయం తెలిసినవాళ్లు రచయితల్లో కానీ, దర్శకుల్లో కానీ ఎంతమంది ఉన్నారు? నిజానికి తెరపై మనకి కనిపించే పాత్రలు నిజ జీవితంలో నిత్యం మనం చవిచూసే రకరకాల ఎమోషన్స్‌కి సింబల్స్‌గా ఉండేవే. సైకలాజికల్‌గా ఈ పాత్రలు అచ్చం మనం ఎమోషన్సే.
హీరో అంటే ఇగోయిస్ట్. హీరోయిన్ అంటే లవ్. కమెడియన్ అంటే ఆహ్లాదం. తల్లి అంటే శాంతిసౌఖ్యాలు. తండ్రి అంటే భద్రతా భావం. గురువు అంటే మార్గదర్శి. విలన్ అంటే మనలో అణచిపెట్టుకున్న అనేకానేక జంతు ప్రవృత్తులు. ఇన్ని రకాల భావోద్వేగాలు కలగలసి మైమరపించేదే మంచి కథ.
ఇవాళ ఇన్ని ఎమోషన్స్ కథలో కనిపించడం లేదు. పాత్రలు కుదించుకుపోతున్నాయి. ఫలితంగా తెరపై మన మనోప్రపంచం పూర్తిగా ఆవిష్కృతం కావట్లేదు. అన్నింటికంటే ప్రధానమైన ఎమోషన్ ఇగో అంటే హీరో కేరెక్టర్నైనా సక్రమంగా చిత్రించగలిగితే చాలు. అదే ‘మజిలీ’ తరహాలో చక్కని కథగా ప్రేక్షకులతో వహ్వా అనిపించుకుంటుంది.
మంచి కథ ఎలా వస్తుంది? | actioncutok.com
More for you: