జూనియర్ ఎన్టీఆర్‌తో చెయ్యాలని ఉంది కానీ…


జూనియర్ ఎన్టీఆర్‌తో చెయ్యాలని ఉంది కానీ...

జూనియర్ ఎన్టీఆర్‌తో చెయ్యాలని ఉంది కానీ…

తొలి సినిమా ‘పెళ్లి చూపులు’తోటే ప్రతిభావంతుడైన డైరెక్టర్‌గా అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు తరుణ్ భాస్కర్. ఇప్పుడు నటుడిగా ‘ఫలక్‌నుమా దాస్’లోనూ మెప్పించాడు. కాగా జూనియర్ ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చెయ్యాలనేది తన కోరికగా చెప్పాడు తరుణ్. అయితే ప్రస్తుతం జూనియర్‌కు సరిపోయే, ఆ మాటకొస్తే ఏ స్టార్ హీరోకూ సరిపోయే స్క్రిప్ట్ తన దగ్గర లేదని అతను వెల్లడించాడు.

“చాలా మంది నన్ను ‘జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఎప్పుడు పనిచేస్తావ్?’.. అని అడుగుతున్నారు. నాకు ఆయనతో కలిసి పనిచెయ్యాలని ఉంది. ఆయన అమేజింగ్ యాక్టర్. కానీ ఏ బిగ్ స్టార్‌తోనూ చేయడానికి తగ్గ స్క్రిప్ట్ ఇప్పుడు నా దగ్గర లేదు. ఆయనకు సరిపోయే లైన్ తట్టి, ఎగ్జైటింగ్‌గా స్క్రిప్ట్ వస్తే అప్పుడు ఆయనను సంప్రదిస్తా. ఇప్పటికే ఆయనను ఓసారి కలిశా. ‘ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే తీసుకురండి. చేద్దాం’ అన్నారు” అని చెప్పాడు తరుణ్ భాస్కర్.

గత ఏడాది అతని డైరెక్షన్‌లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినా, ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. ఇప్పుడు తన మూడో సినిమా కోసం ఒక చక్కని స్క్రిప్టును అతను సిద్ధం చేశాడు.

జూనియర్ ఎన్టీఆర్‌తో చెయ్యాలని ఉంది కానీ… | actioncutok.com

More for you: