కీర్తికి గెస్ట్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్

కీర్తికి గెస్ట్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్
‘మహానటి’ వంటి ఘనవిజయం తరువాత కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు నరేంద్ర రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు నిర్మిస్తున్నాడు. నదియా, నరేశ్, రాజేంద్ర ప్రసాద్, భానుశ్రీ మెహ్రా వంటి తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో పది నిమిషాల పాటు సాగే ఓ పవర్ఫుల్ గెస్ట్ రోల్‌కి స్కోప్ ఉందట. ఈ పాత్రలో అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడని టాక్. ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్‌తో బిజీగా ఉన్న తారక్.. ప్రస్తుతం సాగుతున్న షెడ్యూల్ పూర్తయిన వెంటనే ఈ అతిథి పాత్ర తాలూకు షూటింగ్లో పాల్గొంటాడని వినిపిస్తోంది.
గతంలో వెంకటేశ్ హీరోగా నటించిన ‘చింతకాయల రవి’ (2008)లో ఓ పాటలో తళుక్కున మెరిసిన తారక్… సుదీర్ఘ విరామం తరువాత మళ్ళీ ఇప్పుడు ‘సఖి’ (ప్రచారంలో ఉన్న పేరు)లో అతిథి పాత్రలో కనిపించనుండడం వార్తల్లో నిలిచే అంశమే. మరి.. తారక్ గెస్ట్ రోల్‌పై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కాగా.. ఈ ఏడాది చివరలో ఈ సినిమా తెరపైకి రానుంది.
కీర్తికి గెస్ట్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ | actioncutok.com
More for you: