సైబర్ క్రైం పోలీసులకు చిరంజీవి చిన్నల్లుడి కంప్లైంట్

సైబర్ క్రైం పోలీసులకు చిరంజీవి చిన్నల్లుడి కంప్లైంట్
చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్‌దేవ్ ఐదు రోజుల క్రితం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొంతమంది కావాలని తన ఇన్స్టాగ్రాం అకౌంట్లో అసభ్య పదజాలంతో తనను దూషిస్తున్నారని, వారిపై చర్య తీసుకోవాల్సిందిగా ఆ ఫిర్యాదులో ఆయన కోరాడు. దానికి అనుగుణంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ చేపట్టారు.
కల్యాణ్ దేవ్‌ను అసభ్యంగా దూషిస్తున్న వారి వివరాలు ఇవ్వమని ఇన్స్టాగ్రాం నిర్వాహకులకు లెటర్ రాశామనీ, వారి నుంచి వివరాలు రాగానే చర్యలు తీసుకుంటామనీ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. కొంతమంది ఇన్‌స్టాగ్రాంలో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి, ఉద్దేశ పూర్వకంగా కల్యాణ్ దేవ్‌ను దూషిస్తున్నారని అర్థమవుతోందని, ఇన్స్టాగ్రాం నిర్వాహకుల ద్వారా ఆ అకౌంట్ల ఐపీ అడ్రెస్లు తెసులుకొని, వాళ్లని అదుపులోకి తీసుకుంటామనీ పోలీసులు చెబ్తున్నారు.
చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు కల్యాణ్ దేవ్‌తో 2016 మార్చిలో వివాహమైంది. శ్రీజకు అప్పటికే ఒక వివాహమై ఒక కుమార్తె ఉంది. మొదటి భర్తకు విడాకులిచ్చిన ఆమె కల్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు నవిష్క అనే 4 నెలల పాప ఉంది.
సైబర్ క్రైం పోలీసులకు చిరంజీవి చిన్నల్లుడి కంప్లైంట్ | actioncutok.com
More for you: