‘మన్మథుడు 2’ టీజర్: వర్జిన్ అని అమ్మని కూడా నమ్మించే కాసనోవా!


– కార్తికేయ
'మన్మథుడు 2' టీజర్: వర్జిన్ అని అమ్మని కూడా నమ్మించే కాసనోవా!

‘మన్మథుడు 2’ టీజర్: వర్జిన్ అని అమ్మని కూడా నమ్మించే కాసనోవా!

‘మన్మథుడు’ లాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి సీక్వెల్ తియ్యడమంటే ఆషా మాషీ కాదు. అయినా రాహుల్ రవీంద్రన్ ముచ్చటపడ్డాడు. నాగార్జున కూడా సరదా పడ్డాడు. దాంతో ‘మన్మథుడు 2’ మొదలైంది. నాగార్జున.. తన కొడుకు నాగచైతన్య వయసు కూడా లేని రకుల్‌ప్రీత్ సింగ్‌తో జోడీ కట్టాడు. సినిమాని రాహుల్ ఎలా తీస్తున్నాడోననే సందేహం అభిమానుల్ని పీడిస్తూ ఉంది.

వాటికి కాస్తంత సమాధానం లభించింది ఈ రోజు రిలీజైన ‘మన్మథుడు 2’ టీజర్ చూశాక. కథ ప్రకారం నాగార్జున ముదిరిపోయిన బెండకాయ వయసులో ఉన్నవాడనీ.. పెళ్లీ పెటాకులు లేకుండా ఉన్నాడనీ అర్థమవుతోంది.

'మన్మథుడు 2' టీజర్: వర్జిన్ అని అమ్మని కూడా నమ్మించే కాసనోవా!

అందుకే దేవదర్శిని “నీకు షట్టర్లు మూసేసి దుకాణం సర్దేసే వయసొచ్చింది” అనేసింది.

వెన్నెల కిశోర్ “ఈ వయసులో మీకు పెళ్లేంటి సార్! ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే మళ్లీ పూలు పూస్తాయా?” అని ధైర్యంగా అనగలిగాడు.

రావు రమేశ్ ఒక నవ్వు నవ్వి “పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బ్యాటింగ్‌కు దిగుతున్నావేంట్రా” అన్నాడు.

కన్నతల్లి లక్ష్మి సైతం “ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బావుంటుందిరా. అది కూడా. అదేమంటారూ. వర్జిన్.. రేయ్ నువ్వింకా వర్జినే కదరా” అని వేదన చెందింది.

అమ్మ దగ్గర అవునని చెప్పి, పక్కకు వచ్చి కన్నింగ్‌గా నవ్వేశాడు నాగార్జున. ఆ వెంటనే తమకంగా ఊగిపోతూ అమ్మాయిలకు లిప్‌లాక్‌లు పెట్టాడు. ఆ అమ్మాయిలేవరో తెలీడం లేదు. వాళ్లలో హీరోయిన్ రకుల్‌ప్రీత్ కానీ, స్పెషల్ రోల్ చేసిన కీర్తి సురేశ్ కానీ లేదు.

'మన్మథుడు 2' టీజర్: వర్జిన్ అని అమ్మని కూడా నమ్మించే కాసనోవా!

చివరగా “ఐ డోన్ట్ ఫాల్ ఇన్ లవ్. ఐ ఓన్లీ మేక్ లవ్” అని తన కేరెక్టర్ ఏమిటో చెప్పాడు నాగార్జున అలియాస్ ‘మన్మథుడు 2’. అంటే మనోడు కాసనోవా టైప్ అన్న మాట. ఆ కాసనోవాకి చెక్ చెప్పే అమ్మాయిగా రకుల్‌ప్రీత్ కనిపిస్తుందని ఊహించుకోవచ్చు. మరి కీర్తి సురేశ్ కేరెక్టర్ ఏమిటో తెలియాలంటే ఆగస్ట్ 9 వరకు ఆగాల్సిందే. మొత్తానికి టీజర్‌తో డైరెక్టర్ రాహుల్, హీరో నాగ్ అభిమానుల్ని బాగానే టీజ్ చేశారు.

‘మన్మథుడు 2’ టీజర్: వర్జిన్ అని అమ్మని కూడా నమ్మించే కాసనోవా! | actioncutok.com

More for you: