మైండ్‌ను మెలితెప్పే టాప్ 10 థ్రిల్లర్స్ ఇవే!


– కార్తికేయ
మైండ్‌ను మెలితెప్పే టాప్ 10 థ్రిల్లర్స్ ఇవే!
Inception

మైండ్‌ను మెలితెప్పే టాప్ 10 థ్రిల్లర్స్ ఇవే!

థ్రిల్లర్ అంటే ఏమిటి? మనల్ని కుర్చీల్లో మునివేళ్లపై కూర్చోబెట్టేది.. తర్వాత ఏం జరుగుతుందోననే ఉత్కంఠను రేపేది.. తరచూ రోమాలు నిక్కబొడుచుకొనేలా చేసేది.. ఓవరాల్‌గా మన మెదడుని మెలిపెట్టేది. అలాంటి నిఖార్సయిన థ్రిల్లర్లు చాలానే ఉన్నా.. వాటిలో టాప్ 10ని ఎంచాలంటే కష్టమే. అయినప్పటికీ కాన్సెప్ట్ పరంగా, కథన పరంగా, సన్నివేశాల పరంగా గొప్ప థ్రిల్లర్లు అనిపించుకున్న అలాంటి సినిమాలేవో చూద్దామా…

ఇన్‌సెప్షన్ (2010)

లియొనార్డో డి కాప్రియో, జోసెఫ్ గోర్డాన్ లెవిట్, ఎలెన్ పేజ్, టాం హార్డీ, కేన్ వాటనబుల్ ప్రధాన పాత్రాల్లో నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ను క్రిస్టఫర్ నోలన్ డైరెక్ట్ చేశాడు. ప్రొప్రైటరీ మిలిటరీ టెక్నాలజీతో మనుషుల కలల్లోకి వెళ్లి గమనించే డాం కోబ్ (లియొనార్డో డి కాప్రియో) చుట్టూ నడిచే సినిమా.

ముల్‌హాలండ్ డ్రైవ్ (2001)

డేవిడ్ లించ్ డైరెక్ట్ చేసిన ఈ మిస్టరీలో నవోమీ వాట్స్, లారా హారింగ్, జస్టిన్ థెరాక్స్, ఆన్ మిల్లర్, రాబర్ట్ ఫోర్‌స్టర్ ప్రధాన పాత్రధారులు. బెట్టీ ఎల్మ్స్ (నవోమీ వాట్స్) అనే వర్ధమాన నటి, అమ్నీసియా రోగి రీటా (లారా హారింగ్) అనే ఇద్దరు యువతుల చుట్టూ నడిచే కథ.

ఫైట్ క్లబ్ (1999)

మైండ్‌ను మెలితెప్పే టాప్ 10 థ్రిల్లర్స్ ఇవే!

చక్ పలాహ్నియుక్ నవల ఆధారంగా డేవిడ్ ఫించర్ రూపొందించిన ఈ మూవీలో బ్రాడ్ పిట్, ఎడ్వర్డ్ నోర్టన్, హెలెనా కార్టర్, మీట్ లోఫ్, జారెడ్ లీటో మెయిన్ రోల్స్ చేశారు. ఇన్‌సోమ్నియాతో బాధపడే జాక్ (ఎడ్వర్ట్ నోర్టన్), సోప్ సేల్స్‌మన్ టైలర్ డుర్డెన్ (బ్రాడ్ పిట్) అనే వ్యక్తుల చుట్టూ నడిచే కథ. ఈ కథని చెప్పేది (నెరేటర్) జాక్.

ది యూజ్వల్ సస్పెక్ట్స్ (1995)

హారర్ థ్రిల్లర్స్ స్పెషలిస్ట్ బ్రియాన్ సింగర్ రూపొందించిన ఈ సినిమాలో కెవిన్ స్పేసీ, స్టీఫెన్ బాల్డ్‌విన్, గాబ్రియెల్ బైర్న్, బెనిసియో డెల్ టోరో కీలక పాత్రధారులు. వెర్బల్ కింట్ (కెవిన్ స్పేసీ) అనే మోసగాడి కథ ఇది.

మెమెంటో (2000)

మైండ్‌ను మెలితెప్పే టాప్ 10 థ్రిల్లర్స్ ఇవే!

క్రిస్టఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో గయ్ పియర్స్, కారీ-అన్నే మోస్, జో పాంటోలియానో, మార్క్ బూన్ జూనియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎ.ఆర్. మురుగదాస్ తీసిన ‘గజిని’కి మూలం ఈ సినిమానే. యాంటిరోగ్రేడ్ అమ్నీసియా అనే అరుదైన వ్యాధికి గురైన లియొనార్డ్ షెల్బీ (గయ్ పియెర్స్) చుట్టూ నడిచే స్టోరీ.

వీడియోడ్రోమ్ (1983)

జేమ్స్ వుడ్స్, డెబ్బీ హారీ, సోంజా స్మిత్స్, పీటర్ ద్వోర్‌స్కీ, లెస్లీ కార్ల్‌సన్ ప్రధాన పాత్రధారులైన ఈ చిత్రానికి డేవిడ్ క్రోనెన్‌బర్గ్ దర్శకుడు. మాక్స్ రెన్ (జేమ్స్ వుడ్స్) అనే టీవీ ఎగ్జిక్యూటివ్ కేంద్రంగా కథ నడుస్తుంది.

ట్రాన్స్ (2013)

డానీ బోయల్ (స్లం డాగ్ మిలియనీర్) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో జేమ్స్ మెకవోయ్, విన్సెంట్ కాసెల్, రొసారియో డాసన్, డానీ సపని, మాట్ క్రాస్ ప్రధాన పాత్రధారులు. ఆర్ట్ ఆక్షనర్ సైమన్ (జేమ్స్ మెకవోయ్), హిప్నాథెరపిస్ట్ ఎలిజిబెత్ లాంబ్ (రొసారియో డాసన్) చుట్టూ నడిచే కథ.

సోర్స్ కోడ్ (2011)

జేక్ గిల్లెన్‌హాల్, మిషెల్లే మోనాఘన్, వెరా ఫర్మిగా, జెఫ్రీ రైట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని డంకన్ జోన్స్ డైరెక్ట్ చేశాడు. కెప్టెన్ కోల్టర్ స్టీవెన్స్ (జేక్ గిల్లెన్‌హాల్) అనే యు.ఎస్. హెలికాప్టర్ పైలట్ కేంద్రంగా కథ నడుస్తుంది.

ద గేమ్ (1997)

మైండ్‌ను మెలితెప్పే టాప్ 10 థ్రిల్లర్స్ ఇవే!

డేవిడ్ ఫించర్ రూపొందించిన ఈ థ్రిల్లర్‌లో మైఖెల్ డగ్లస్, షాన్ పెన్, జేమ్స్ రెభార్న్, డెబోరా కారా ఉంగర్, పీటర్ డోనాట్, కరోల్ బేకర్ ప్రధాన పాత్రధారులు. నిలొలస్ వాన్ ఆర్టన్ (మైఖెల్ డగ్లస్), అతని తమ్ముడు కాన్రాడ్ (షాన్ పెన్) చుట్టూ నడిచే కథ.

ఎంటర్ ద వాయిడ్ (2009)

గాస్పర్ నో డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నథానియల్ బ్రౌన్, పాజ్ డి లా హుయెర్టా, సిరిల్ రాయ్, ఎమిలీ అలైన్ లిండ్, జెస్సీ కున్, ఒల్లీ అలెగ్జాండర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ (నథానియెల్ బ్రౌన్) అనే ఒక యువ డ్రగ్ డీలర్ చుట్టూ ఈ కథ నడుస్తుంది.

మైండ్‌ను మెలితెప్పే టాప్ 10 థ్రిల్లర్స్ ఇవే! | actioncutok.com

More for you: